- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రియాంక చోప్రా భర్తకు చేదు అనుభవం.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో!
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ అమ్మడు వయసులో తనకంటే 10 ఏళ్లు చిన్నవాడైన అమెరికా పాప్ సింగర్ నిక్ జోనాస్(Nick Jonas)ను ప్రేమించింది. 2018లో వీరిద్దరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కూతురు కూడా ఉంది. అయితే ప్రియాంక పెళ్లై పాప ఉన్నప్పటికీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతోంది. ఇక నిక్ జోనాస్ సాంగ్ పాడుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ప్రియాంక(Priyanka Chopra) భర్తకు చేదు అనుభవం ఎదురైనట్లు సమాచారం. చెక్ రిపబ్లిక్‌లోని ప్రేగ్‌లో ఆయన తన సోదరుడితో కలిసి ఓ కాన్సర్ట్ చేస్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తి లేజర్ లైట్ వేసినట్లు తెలుస్తోంది.
దీంతో ఒక్కసారిగా కంగారు పడిపోయిన నిక్ కాన్సర్ట్ మధ్యలోనే ఆపేసి అక్కడనుంచి పరుగెత్తుకుంటూ వెళ్లిపోయాడు. ఆ తర్వాత తన భద్రతా సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు అతడిని పట్టుకుని అక్కడినుంచి పంపించారని టాక్. నిక్ కిందకు వచ్చినప్పటికీ అతని సోదరుడు మాత్రం స్టేజ్ పైనే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఈ విషయం బయటకు వచ్చింది. దీంతో ఈ ఘటన గురించి తెలిసిన వారంతా అసలు నిక్‌పై ఎవరైనా దాడి చేయాలనుకుని అలా చేశారా? లేక బెదిరించాలనే అలా ప్రవర్తించారా అని అయోమయంలో పడిపోయారు. ఆయన డేంజర్‌లో ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండటం బెటర్ అని అభిప్రాయ పడుతున్నారు.