- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేవైఎం కార్యకర్తలకు జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య కీలక మెసేజ్..
దిశ, కంది: భారతీయ జనతా యువ మోర్చా సత్తా ఏంటో కొన్ని రాష్ట్రాలు చూపించాల్సిన అవసరం ఉందని బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య అన్ని రాష్ట్రాల నాయకులకు పిలుపునిచ్చారు. మంగళవారం జరిగిన జాతీయ యువ మోర్చా సమావేశంలో ఆయన పలు అంశాలపై అన్ని రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చిన యువ మోర్చా నాయకులతో చర్చించారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, సంగారెడ్డి జిల్లా ఇంచార్జి సాయిరామ్ గౌడ్ పార్టీ పని తీరును ఆయనకు ప్రత్యేకంగా వివరించారు. ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ రోజురోజుకు పుంజుకుంటున్న తరుణంలో యువమోర్చా కింది స్థాయి కార్యకర్తల నుంచి నాయకులు దాకా పార్టీని మరింత బలోపేతం చేసేలా కృషి చేయాలని సూచించారు.
తద్వారా తెలంగాణలో కాషాయం జెండా ఎగిరేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు సాగాలని సలహాలు అందించారు. ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ధి అంశాలను గ్రామాల వారిగా పర్యటించి ప్రజలకు వివరించాలన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వానికి దీటుగా బీజేపీ ముఖ్య నాయకులతో పాటు యువ మోర్చా నాయకులు కూడా ప్రజలకు మద్దతుగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేసి వారికి అండగా నిలవడం మంచి పరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి పుల్ల శివ శంకర్, రాష్ట్ర నాయకులు మంద విజయ్, ఆదిత్య, మోహన్ నాయక్, దినేష్, తదితరులు పాల్గొన్నారు.