గుడ్ న్యూస్ చెప్పిన ప్రశాంత్ వర్మ.. దీపావళికి అప్డేట్ రాబోతుందంటూ పోస్ట్

by Hamsa |
గుడ్ న్యూస్ చెప్పిన ప్రశాంత్ వర్మ.. దీపావళికి అప్డేట్ రాబోతుందంటూ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prashanth Verma) తెరకెక్కించిన ఫస్ట్ మూవీ ‘హనుమాన్’(Hanuman) బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇదే ఫామ్‌తో ప్రశాంత్ వర్మ వరుస సినిమాలు ప్రకటిస్తూ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేస్తున్నారు. ఇటీవల ప్రశాంత్ వర్మ బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ(Mokshajna Teja) ఫస్ట్ మూవీ ‘సింబ’ తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ప్రశాంత్ వర్మ యూనివర్స్ నుంచి ‘హనుమాన్-2’(Hanuman-2)తో పాటు వేరే ప్రాజెక్ట్‌ కూడా రాబోతున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ప్రశాంత్ వర్మ సినీ ప్రియులకు గుడ్ న్యూస్ ప్రకటించారు. అక్టోబర్ 30న #PVCU-7 నుంచి అప్డేట్ రాబోతున్నట్లు వెల్లడించారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న ప్రశాంత్ వర్మ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed