- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Prakash Ambedkar: రాష్ట్రపతి ఎన్నికల నుంచి తప్పుకోండి: ప్రకాష్ అంబేడ్కర్
న్యూఢిల్లీ: Prakash Ambedkar Request Yashwant Sinha To Withdraw From Presidential Elections| ప్రతిపక్ష పార్టీ రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా.. రాష్ట్రపతి పోటీ నుంచి తప్పుకోవాలని అంబేడ్కర్ మనవడు, వంచిత్ బహుజన్ అఘాడీ (వీబీఏ) అధ్యక్షుడు ప్రకాష్ అంబేడ్కర్ శనివారం కోరారు. ఇప్పటికే ఎన్డీఏ అభ్యర్థి అయిన ద్రౌపది ముర్ముకు అన్ని ప్రాంతీయ పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు మద్దతు తెలుపుతున్నారని ప్రకాష్ అంబేడ్కర్ తెలిపారు. ద్రౌపది ముర్మునే రాష్ట్రపతి అభ్యర్థిగా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఈ క్రమంలో యశ్వంత్ సిన్హా రాష్ట్రపతి రేసు నుంచి తప్పుకుంటేనే గౌరవమని ప్రకాష్ అంబేడ్కర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. కాగా, ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు బీజేపీ, వైఎస్సార్ సీపీ, బీఎస్పీ, ఏఐఏడీఎంకే, టీడీపీ, జేడీఎస్ తదితర పార్టీలు మద్దతు తెలిపాయి. దాదాపు 60 శాతం ఓట్లు ముర్ముకు పడనున్నట్లు అంచనా. కాగా, జులై 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి.
ఇది కూడా చదవండి: రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు ఆప్ మద్దతు
- Tags
- Prakash Ambedkar