చెల్లెళ్లతో ప్రభాస్.. అన్నయ్యతో చిన్నప్పటి ఫొటోస్ షేర్ చేసి విష్ చేసిన ప్రసీదా.. అప్పట్లో ఎంత క్యూట్‌గా ఉన్నాడో

by Kavitha |
చెల్లెళ్లతో ప్రభాస్.. అన్నయ్యతో చిన్నప్పటి ఫొటోస్ షేర్ చేసి విష్ చేసిన ప్రసీదా.. అప్పట్లో ఎంత క్యూట్‌గా ఉన్నాడో
X

దిశ, సినిమా: నేడు(అక్టోబర్ 23) పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు కావడంతో సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు చాలా మంది సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ చెల్లెలు ప్రసీద కూడా చిన్నప్పుడు అన్నయ్యతో దిగిన పిక్స్ షేర్ చేస్తూ డార్లింగ్‌కు బర్త్‌డే విషెస్ చెప్పింది.

దివంగత హీరో కృష్ణం రాజుకు నలుగురు కూతుళ్లు అన్న సంగతి తెలిసిందే. ఈ నలుగురికి ప్రభాస్ అన్నయ్య. వీరితో ప్రభాస్ ఎంతో సరదాగా ఉంటాడు. అందుకే అన్నయ్య అంటే చెల్లెళ్లకి కూడా ఎంతో ప్రేమ. అయితే ఈ నలుగురు చెల్లెళ్లలో ఇప్పటికే ప్రసీద నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. తమ నిర్మాణ సంస్థ బాధ్యతలను చూసుకుంటుంది. అలాగే ప్రభాస్ సినిమా ఈవెంట్లలో పాల్గొంటుంది. సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ ఫ్యామిలీకి సంబంధించిన అనేక విషయాలను పంచుకుంటుంది. కాగా నేడు ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో చాలా ఫొటోలు షేర్ చేసి అన్నయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వీటిని చూసిన నెటిజన్లు ప్రభాస్ ఎంత క్యూట్‌గా ఉన్నాడో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

(video link credits to praseedha instagram id)

Advertisement

Next Story

Most Viewed