- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Adipurush | KTR: 'ఆదిపురుష్' పొలిటికల్ ఎజెండాలో భాగమే.. కేటీఆర్
Adipurush | KTR
దిశ, సినిమా: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఓం రౌత్ దర్శకత్వంలో శ్రీరాముడిగా నటిస్తున్న చిత్రం 'ఆదిపురుష్'. రామాయణంలోని కీలక అంశాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై తాజాగా మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ మేరకు వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా.. అదే సమయంలో తెలంగాణలో ఎన్నికలు రానున్న సందర్భంగా టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది.
ఈ నేపథ్యంలో 'ఆదిపురుష్'పై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. బీజేపీ ఎజెండాలో భాగంగా 'ఆదిపురుష్' చిత్రం తెరకెక్కుతోందంటూ కామెంట్ చేశారు. అంతేకాదు దేశం మొత్తం బీజేపీ భావజాలం వ్యాప్తి చేసేందుకు 16 సినిమాలను తెరకెక్కిస్తున్నారన్న ఆయన.. ఇప్పటికే 'ఉరి ది సర్జికల్ స్టైక్', 'కశ్మీర్ ఫైల్స్' లాంటి చిత్రాలను విడుదల చేశారన్నారు. ఇక ఎన్నికల సమయంలో 'ఆదిపురుష్'ను విడుదల చేసేందుకు పావులు కదుపుతున్నారన్న మంత్రి.. ప్రభాస్ చిత్రం ద్వారా మరోసారి శ్రీరాముడి సెంటిమెంట్ పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ సినిమా ఖచ్చితంగా పొలిటికల్ ఎజెండాలో భాగమేనని ఆరోపణలు చేశారు. ఇక చివరగా రామ రాజ్యం అంటే బీజేపీ ప్రభుత్వం అనే భావన కల్పించే ప్రయత్నంలో భాగమే ఇదంతా అంటూ సంచలన కామెంట్స్ చేశారు.