- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చావు బతుకుల్లో కొడుకు.. ఆర్థిక సాయం కోసం తల్లిదండ్రుల ఎదురు చూపులు
దిశ, అడ్డాకుల: చదువులో, ఆటల్లో చురుగ్గా ఉండే కుర్రవాడికి తెల్ల రక్త కణాలు పడిపోవడం వల్ల ముక్కులో నుంచి బ్లడ్ ఎక్కువ కారుతుంది. ప్రైవేట్ చికిత్స కోసం ఇప్పటికే రూ.1,30,000 వేల ఖర్చయింది. ఇంకా మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలపడంతో కొడుకును బతికించుకోవడం కోసం తల్లిదండ్రులు ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. అడ్డాకుల మండల కేంద్రానికి చెందిన లక్ష్మమ్మ, రాములు ల మనవడు రాజు కొన్ని రోజుల నుంచి కొత్తకోట పారిజాత హాస్పిటల్ లో చికిత్స పొందుతూ.. ఇప్పుడు పరిస్థితి బాలేక ఉస్మానియా హాస్పిటల్ చికిత్స పొందుతున్నాడు. ఎంతో ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండే తమ కుమారుడికి తెల్ల రక్త కణాలు పడిపోయి ముక్కులో నుంచి బ్లడ్ రావడం వల్ల తల్లిదండ్రులు బాధపడుతున్నారు. చేతుల్లో ఉన్న కొద్ది సొమ్మును ఆస్పత్రిలో కట్టామని, మా బాలుడి నూరేళ్లు జీవితానికి మీ వంతుగా తోచిన సాయం చేయాలని కోరుతున్నారు. మీరు 9396252659 నెంబర్ కి గూగుల్ పే, ఫోన్ పే ద్వారా సాయం చేయండని వేడుకుంటున్నారు.
- Tags
- Poor parents
- help