ఆయన కమిట్‌మెంట్ బాగా నచ్చింది.. స్టార్ హీరోపై నటి ప్రశంసలు

by Vinod kumar |   ( Updated:2022-04-10 15:01:29.0  )
ఆయన కమిట్‌మెంట్ బాగా నచ్చింది.. స్టార్ హీరోపై నటి ప్రశంసలు
X

దిశ, సినిమా: స్టార్ యాక్ట్రెస్ పూజా హెగ్డే తీరని కల ఒకటి తాజాగా నెరవేరిందని వెల్లడించింది. ఆమె విజయ్ సరసన నటించిన 'బీస్ట్' చిత్రం ఈ నెల 13 ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ప్రమోషన్స్‌లో పాల్గొన్న పూజ విజయ్‌పై ప్రశంసలు కురిపించడంతో పాటు సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ మూవీ అభిమానులందరినీ ఆకట్టుకుంటుంది. విజయ్‌తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నా. బీస్ట్‌తో అది నెరవేరింది. విజయ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. అతని నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. వృత్తిపట్ల ఆయన చూపే అంకితభావం నాలో స్ఫూర్తి నింపింది. నా బర్త్‌డే‌కు విజయ్ స్పెషల్ పార్టీ ఏర్పాటు చేయడం ఎన్నటికీ మరిచిపోను. అలాగే సినిమాలో పనిచేసిన వారందరి బిహేవియర్ నాకు బాగా నచ్చింది' అంటూ వివరించింది. అలాగే 'అరబిక్ కుత్తు' పాటకు ఈ స్థాయిలో క్రేజ్ రావడం ఎంతో ఆనందంగా ఉందన్న పూజ.. చాలామంది పాట మీనింగ్ అడుగుతున్నారు కానీ ఇప్పటికీ తనకు కూడా తెలియదని, అంతా అనిరుధ్ మాయ అంటూ పొగిడేసింది.


Advertisement

Next Story