అమితాబ్‌పై పూజా హెగ్డే ఎమోషనల్ కామెంట్స్..

by Manoj |
అమితాబ్‌పై పూజా హెగ్డే ఎమోషనల్ కామెంట్స్..
X

దిశ, సినిమా : స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కెరీర్‌లో దూసుకుపోతోంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వరుసబెట్టి సినిమాలు చేస్తోంది. ఇదే క్రమంలో 'కభీ ఈద్‌ కభీ దివాళి' మూవీతో సల్మాన్ ఖాన్‌‌‌తో జతకట్టిన భామ.. 'సర్కస్‌' చిత్రంలో రణ్‌వీర్‌ సింగ్‌‌కు జోడీగా కనిపించనుంది. ఇలా ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పలు వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తోంది. ఇక రీసెంట్‌గా అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి 'మజా' కూల్‌డ్రింక్ యాడ్‌‌‌ చేసిన పూజ.. ఆయనపై చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

'అమితాబ్‌ సర్‌తో కలిసి నటించే చాన్స్ దక్కడం నా అదృష్టం. నాలాంటి వాళ్లకు ఆయన గురువు లాంటి వారు. ఈ వయసులోనూ బిగ్ బీ టైమ్ పంక్చువాలిటీ, డెడికేషన్‌ నాకు ఎంతగానో నచ్చాయి. మజా యాడ్‌లో అమితాబ్‌ మనుమరాలిగా నటించాను. ఈ సమయంలో పొందిన అనుభూతిని మాటల్లో చెప్పలేను' అంటూ తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది.

Advertisement

Next Story

Most Viewed