అదరగొడుతున్న 'పొన్నియన్ సెల్వన్'.. ఒకేసారి నాలుగు అప్‌డేట్స్

by Anukaran |
అదరగొడుతున్న పొన్నియన్ సెల్వన్.. ఒకేసారి నాలుగు అప్‌డేట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: భారీ మల్టీస్టారర్‌గా తెరకెక్కతున్న సినిమా 'పొన్నియన్ సెల్వన్'. ఈ సినిమాలో విక్రమ్, కార్తి, ఐశ్వర్యరాయ్, త్రిష, జయం రవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రాజుల కాలం నాటి కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఈ సినిమా రెడీ అవుతోంది. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ మూవీ మేకర్స్ సినిమా ప్రేమికుల భారీ ట్రీట్ ఇచ్చారు. ఒకే రోజు ఐదు పోస్టర్లు రిలీజ్ చేసి ప్రేక్షకులకు కన్నుల పండగ చేశారు. ఈ సినిమా నుంచి విక్రమ్, జయం రవి, కార్తి, త్రిష, ఐశ్వర్య ఫస్ట్ లుక్స్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్స్ సోషల్ మీడియాలో దండయాత్ర చేస్తున్నాయి. ఈ పోస్టర్స్‌లో ప్రతి ఒక్కరూ నెవ్వర్ బిఫోర్ అనేలా ఉన్నారు. భారీ బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కతోంది. అయితే ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ మూవీ తమిళం, హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో రూపొందుతోంది. మరి ఈ మూవీ అనుకున్నంత స్థాయిలో రాణిస్తుందా లేదా అన్నది తెలియాలంటే సెప్టెంబర్ వరకు వెయిట్ చేయాల్సిందే.


Advertisement

Next Story