పోలీసులపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత.. సామాన్యుల పైనే వారి ప్రతాపం

by Disha Desk |
పోలీసులపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత.. సామాన్యుల పైనే వారి ప్రతాపం
X

న్యూఢిల్లీ: దేశంలో పోలీసింగ్ వ్యవస్థ పై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సంచలన విషయాలు వెల్లడించింది. దేశవ్యాప్తంగా పోలీసులు పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిపింది. సామాన్యులను వారు చులకనగా చూస్తున్నారని పేర్కొంది. పోలీసుల నుండి ఇటువంటి ప్రవర్తనకు వివిధ కారణాలు ఉన్నాయనే వాస్తవాన్ని కొట్టిపారేయలేమని వెల్లడించింది. ఈ విషయంలో సరైన శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యమని సూచించింది. పోలీసు శాఖలో మహిళలకు ప్రాధాన్యత తక్కువగానే ఉందని తెలిపింది. ప్రస్తుతం ఉన్న 10.3శాతం ప్రాధాన్యతను 33 శాతానికి పెంచాల్సిన అవసరముందని పేర్కొంది. ప్రతి జిల్లాలో కనీసం ఒక మహిళ పోలీసు స్టేషన్‌తో పాటు, మహిళల నియమాకానికి అదనపు పోస్టులను సృష్టించాల్సిన అవసరముందని తెలిపింది. కాగా, 2025-26 వరకు మరో మూడు ఆర్థిక సంవత్సరాల వరకు పోలీసు బలగాల ఆధునీకరణ పథకాన్ని పొడిగించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆమోదించారు. కేంద్ర వ్యయం రూ. 26,275 కోట్లతో సమస్యలను అధిగమించడానికి బలగాలను సన్నద్ధం చేయనున్నట్లు తెలిపింది. ఈ పథకం ద్వారా అంతర్గత భద్రత, శాంతి-భద్రతల పరిరక్షణ, అత్యాధునిక సాంకేతికతతో పాటు డ్రగ్స్ రవాణాను అడ్డుకోవడానికి రాష్ట్రాలకు సహకారంతో పాటు పటిష్టమైన ఫోరెన్సిక్ ఏర్పాటు చేయనుంది.

Advertisement

Next Story

Most Viewed