- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను ఎందుకు చంపాలని అనుకున్నానంటే..
దిశ, తెలంగాణ బ్యూరో : మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్య కుట్ర కేసులో మొత్తం 8 మంది నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారిని వారం రోజుల కస్టడీ కోరుతూ మేడ్చల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ హత్యకు కుట్ర కోణాన్ని, తొలి రోజున రాఘవేంద్రరాజు ఇచ్చిన స్టేట్మెంట్ను కోర్టుకు నివేదించారు. నిందితులను కస్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. వారిని విచారించాలంటూ మేడ్చల్ కోర్టుకు గురువారం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మేడ్చల్ కోర్టు ఇంకా ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు.
కాగా, మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్రరాజు పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు చెప్పుతున్నారు. 2017 నుంచి తనను చంపేందుకు ప్రయత్నం చేశారని, తనను, తన కుటుంబాన్ని శ్రీనివాస్‌గౌడ్ టార్గెట్ చేశారని వెల్లడించారు. శ్రీనివాస్‌గౌడ్ నుంచి ప్రాణ హాని ఉందని, ఆయన వేధింపులు తట్టుకోలేక పోయానని రాఘవేంద్రరాజు చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. వేధింపులు తట్టుకోలేకే శ్రీనివాస్‌గౌడ్‌ను చంపాలనుకున్నానని, తనపై శ్రీనివాస్‌గౌడ్ 30 కేసులు పెట్టించారని, ఒకే రోజు 10 కేసులు పెట్టించారని, తన బార్‌షాప్‌ను మూసివేయించి ఇబ్బందిపెట్టారని, ఆర్థికంగా కూడా నాకు నష్టం చేయించారని, శ్రీనివాస్ గౌడ్ కారణంగా తనకు రూ.6 కోట్లు నష్టం వచ్చిందంటూ పోలీసుల విచారణలో వెల్లడించారు.
ఇంకా తన వ్యాపారాలన్నీ దెబ్బతీశారని, ఇప్పటికీ తనకు రావాల్సిన డబ్బులను రాకుండా అడ్డుకుంటున్నారని విచారణలో రాఘవేంద్రరాజు తెలిపారు. తన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని దెబ్బతీశాడని, అంతేకాకుండా అక్రమంగా ఎక్సైజ్ కేసులు నమోదు చేయించినట్లు పోలీసుల విచారణలో వివరించాడు. తన ఆధార్ఎన్రోల్మెంట్ కేంద్రాన్ని కూడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ రద్దు చేయించాడని, ఈ కారణాలతోనే మంత్రి హత్యకు కుట్ర పన్నినట్లు నిందితుడు రాఘవేంద్రరాజు పోలీసులకు వెల్లడించినట్లు చెప్పుతున్నారు.