- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బయటకు స్పా.. లోపల వ్యభిచారం.. పోలీసులు ఎంట్రీతో సీన్ రివర్స్
దిశ, బంజారాహిల్స్: స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు స్పా పై దాడి చేసి పది మంది యువతులను, ఇద్దరు విటులను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజరాహిల్స్ రోడ్ నంబర్ 12లో హ్యాపీ థాయ్ స్పా పేరుతో మహేష్ సింగ్ అనే వ్యక్తి కొంత కాలం క్రితం ఇక్కడ స్పా ఏర్పాటు చేశాడు. అయితే ఇక్కడ నిబంధనలు ఉల్లంఘిస్తూ స్పాను వ్యభిచార కేంద్రంగా మార్చినట్లుగా గుర్తించారు. థెరపిస్ట్‌ల పేరుతో యువతులను నియమించుకుని క్రాస్ మసాజుకు పాల్పడుతున్నట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది.
వెస్ట్ బెంగాల్, ముంబై, నోయిడా, కూకట్పల్లి, ఎన్బీటీనగర్, ఉత్తరప్రదేశ్, ఘజియాబాద్, తదితర ప్రాంతాలకు చెందిన పది మంది యువతులను ఇక్కడ థెరపిస్ట్‌లుగా నియమించుకుని వ్యభిచార గృహాన్ని నడిపిస్తున్నట్లుగా గుర్తించారు. ఒక్కొక్కరికి 12 వేల నుంచి 15 వేల వరకు జీతాలు ఇస్తూ వారిని వ్యభిచారులుగా మార్చిన మహేష్ సింగ్, మేనేజర్ ఆర్తి మండల్ అలియాస్ రానా, ఇంద్రపాల్ కౌర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. ఢిల్లీకి చెందిన మహేష్ సింగ్ ఈ స్పాను నడిపిస్తుండగా.. పోలీసుల దాడుల్లో బంజారాహిల్స్ రోడ్ నెం.1లో నివసించే ఇద్దరు విటులు పట్టుబడ్డారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.