సైలెంట్‌గా పని కానిస్తున్న పేకాట రాయుళ్లు.. పోలీసులు సడెన్ ఎంట్రీ ఇవ్వడంతో..

by Javid Pasha |
సైలెంట్‌గా పని కానిస్తున్న పేకాట రాయుళ్లు.. పోలీసులు సడెన్ ఎంట్రీ ఇవ్వడంతో..
X

దిశ, ముషీరాబాద్ : గుట్టు చప్పుడు కాకుండా పేకాట ( తీన్ పత్తే ) ఆడుతున్న ఆరుగురిని ముషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ జహంగీర్ యాదవ్ తెలిపిన వివారల ప్రకారం.. ముషీరాబాద్ డివిజన్ బాపూజీ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద సలీం అనే వ్యక్తి నివాసంలో శుక్రవారం గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సలీం ఇంటిపై రైడ్ చేసి పేకాటరాయుళ్లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ రైడ్‌లో పేకాట ఆడుతున్న మహమ్మద్ సలీం ( 32 ), కె. సాయిలు ( 43 ), ఎ. శ్రీనివాస్ ( 60 ), జి. గణేష్ ( 40 ), పి. రమేష్ ( 53 ), ఎ. పెంటయ్య ( 80 ) లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.13,630 నగదు, రెండు సెట్ల ప్లే కార్డ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story