- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఐక్యతతోనే సవాళ్లను ఎదుర్కోవచ్చు: బిమ్స్‌టెక్ సమావేశంలో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ఆరోగ్య, ఆర్థిక భద్రత సవాళ్లను ఎదుర్కోడానికి ఐకమత్యం, సహకారం అవసరముందని ప్రధాని మోడీ అన్నారు. బుధవారం శ్రీలంక అధ్యక్షతన జరిగిన 5వ బిమ్స్‌టెక్ శిఖరాగ్ర సమావేశంలో ఆయన ప్రసంగించారు. బిమ్స్‌టెక్ సెక్రటేరియట్‌కు దాని కార్యాచరణ బడ్జెట్‌ను పెంచడానికి భారత్ 1 మిలియన్ డాలర్లు అందజేస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. సెక్రటెరియట్ సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరముందని ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన విధివిధానాలు రూపొందించాలని ఆయన కోరారు. మన ప్రాంతంలో ఆరోగ్య, ఆర్థిక భద్రత సవాళ్లను ఎదుర్కోడానికి ఐక్యత, సహకారానికి అవసరముంది. అయితే యూరప్ లో కొన్ని రోజులుగా నెలకొన్న పరిస్థితులు అంతర్జాతీయ సరిహద్దు సుస్థిరతపై ప్రశ్నలు తలెత్తేలా చేస్తున్నాయి అని తెలిపారు.
బంగాళాఖాతాన్ని అనుసంధానం, శ్రేయస్సు, భద్రతకు వారధిగా మార్చుకోవాలని అన్నారు. కొత్త ఉత్సాహంతో పని చేయడానికి తమను తాము అంకితం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దీని ఫలితాలు బిమ్స్‌టెక్ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతాయని అన్నారు. అంతకుముందు గ్రూపింగ్ సహకార కార్యకలాపాల పూర్తి పునర్వ్యవస్థీకరణకు సభ్య దేశాలు ఆమోదం తెలిపాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఏడు స్తంభాలలో భద్రత స్తంభానికి భారత్ బాధ్యత వహిస్తుందని చెప్పారు. కాగా బిమ్స్ టెక్ లో ఏడు దేశాలు సభ్యులుగా ఉన్నాయి. భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, థాయ్‌లాండ్, నేపాల్, భూటాన్ దీనిలో ఉన్నాయి.