- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దోచుకోవడం, విభజించడం పైనే కాంగ్రెస్ దృష్టి: ప్రధాని మోడీ
ఇంఫాల్: మణిపూర్ ఎన్నికల రెండో దశ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ పై ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ దోచుకోవడం, విభజించడం పైనే దృష్టి పెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రధాన నేతను మిస్టర్ 10 పర్సెంట్‌గా పిలిచారని విమర్శించారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక్రాం ఇబోబి సింగ్‌పై ఆయన పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు మంగళవారం నిర్వహించిన వర్చువల్ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. 'కాంగ్రెస్ మణిపూర్‌లో ఎలాంటి అభివృద్ది చేయలేదు. రాష్ట్రాన్ని ప్రశాంతతకు దూరంగా ఉంచి, మిలిటెంట్ కార్యకలాపాలను ప్రోత్సాహించి, లోయ, కొండ ప్రాంతాలుగా విభజించింది. అటల్ బిహారీ వాజ్‌పేయి ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. కానీ, 2004లో యూపీఏ అధికారంలోకి వచ్చాక దానిని అమలు చేయలేదు. కాంగ్రెస్ బలహీనమవుతూ, మణిపూర్‌ను విభజించి పాలిస్తూ బలహీనం చేసింది' అని ప్రధాని అన్నారు. బీజేపీ కొండ ప్రాంతాల్లోని గ్రామాల్లోకి వెళ్లి ప్రజలతో అనుసంధానమవుతుందని తెలిపారు. తమ పార్టీ కూటమి తిరిగి అధికారంలోకి వస్తుందని నొక్కి చెప్పారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ఆకాంక్ష గా ఉన్న రైలు సేవలను బీజేపీ తీసుకొచ్చిందని అన్నారు. ఇప్పటికే 38 స్థానాలకు తొలి దశలో పోలింగ్ జరగ్గా శనివారం మరో 22 స్థానాలకు జరగనున్నాయి.