- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ జిల్లాలో పీకే టీం.. ఫోకస్!
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ, ప్రభుత్వ పరిస్థితిపై పీకే టీం ఫోకస్ పెట్టింది.. ఎమ్మెల్యేలు గెలిచేదెవరు.. ఓడేదెవరు.. పార్టీ పరిస్థితి ఏంటీ.. ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది. విపక్ష పార్టీల పరిస్థితి ఏంటీ.. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయకుల పరిస్థితి ఏంటీ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులు.. పార్టీ, ప్రభుత్వం పట్ల ఎలాంటి వైఖరితో ఉన్నారు. వారిలో అసంతృప్తికి గల కారణాలేంటనేది ఫోన్లు చేసి వివరాలు సేకరించారు. ప్రజల్లో పార్టీ, ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యేల పనితీరుపై క్షేత్రస్థాయిలో బృందాలు పర్యటిస్తూ.. సమగ్ర వివరాలు సేకరిస్తున్నాయి..!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఫీడ్ బ్యాక్ కోసం పీకే టీం రంగంలోకి దిగింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో తెలంగాణ ఉద్యమకారులకు ఫోన్లు చేసి వివరాలు సేకరించారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న తెలంగాణ ఉద్యమకారులు, ఉద్యమంలో కేసులో ఇరుక్కున్నవారు, పార్టీ కోసం అవిశ్రాంతంగా పని చేసిన వారికి ఫోన్లు చేసి.. వివరాలు తీసుకుంటున్నారు. పార్టీతో వారికి ఎలాంటి సంబంధాలున్నాయి.. పార్టీ, ప్రభుత్వం తీరు పట్ల వీరి వైఖరి ఏ విధంగా ఉంది. పార్టీ, ప్రభుత్వంలో పదవులు, ప్రాధాన్యత దక్కిందా.. వీరు పార్టీకి, ప్రభుత్వానికి ఎందుకు దూరంగా ఉంటున్నారనే విషయాలను అడిగి తెలుసుకుంటున్నారు. వీరిలో అసంతృప్తికి గల అసలు కారణాలేంటనే వివరాలు సేకరిస్తున్నారు. చాలా చోట్ల అసలు ఉద్యమకారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తేలింది.
తాజాగా క్షేత్రస్థాయిలో పరిస్థితులపై సర్వే చేపట్టారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పీకే టీం పర్యటిస్తోంది. వివిధ గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ తీరుపై ఓటర్లు, ప్రజలను నేరుగా కలిసి వివరాలు సేకరిస్తున్నారు. పార్టీ పరిస్థితి ఏంటీ.. ప్రభుత్వ పథకాల అమలు తీరు ఎలా ఉంది.. స్థానిక ఎమ్మెల్యే పనితీరు ఏ విధంగా ఉందనే వివరాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో సర్వే కూడా పూర్తి చేయగా.. మిగతా నియోజకవర్గాల్లో సర్వే కొనసాగుతోంది. క్షేత్రస్థాయిలో బృందాలుగా విడిపోయి.. వివిధ పథకాల అమలు తీరు, హామీల అమలు తీరుపై వివరాలు తీసుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యేల తీరుపై అడిగి తెలుసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీకి అనుకూలంగా ఉన్నారా.. స్థానిక ఎమ్మెల్యేకు అనుకూలమా.. వ్యతిరేకమా.. అనే వివరాలు తీసుకుంటున్నారు.