Petrol Price: ఆగని పెట్రోల్, డీజిల్ మోతా

by Mahesh |   ( Updated:2022-04-06 06:16:19.0  )
Petrol Price: ఆగని పెట్రోల్, డీజిల్ మోతా
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 90, డీజిల్ పై 87 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ. 119.49, డీజిల్ రూ. 105.49 గా ఉంది. ఈ విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూ పోతే సామాన్యుడు బైక్ నడపడం కష్టంగానే మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రానున్న రోజుల్లో.. నిత్యావసర వస్తువుల ధరలు కూడా గణనీయంగా పెరిగి పోతాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story