బిగ్ స్క్రీన్‌పై తండ్రితో కలిసి సందడి చేయనున్న స్టార్ హీరో కూతురు

by samatah |   ( Updated:2023-08-18 15:40:21.0  )
బిగ్ స్క్రీన్‌పై తండ్రితో కలిసి సందడి చేయనున్న  స్టార్ హీరో కూతురు
X

దిశ, వెబ్‌డెస్క్ : మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట నుంచి పెన్నీ అనే రెండవ సింగిల్ ప్రోమో విడుదలైంది. ఈ పాటలో మహేష్ బాబు కూతురు కనిపించడంతో పాటకు భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అయితే కొద్ది సేపటి క్రితమే సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. సరిగ్గా నెల రోజుల క్రితం చిత్ర బృదం ఈ సినిమా నుంచి కళావతి సాంగ్‌ను విడుదల చేసింది. దీంతో ఈ సాంగ్‌కు అభిమానుల నుంచి మంచి ఆదరణ లభించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఈ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కాగా, మహేష్ బాబు కూతురు సితారకు కూడా డ్యాన్స్ అంటే చాలా ఇష్టం.. ఇటీవల ఆమె కళావతి పాటకు డ్యాన్స్ చేసి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ చిన్నారి ముద్దుగుమ్మ. ఇక తన తండ్రితో బిగ్ స్క్రీన్‌పై తొలిసారి ఆడిపాడనుండటంతో పెన్నీ సాంగ్ రికార్డ్ క్రియేట్ చేస్తుందని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఇక రేపు విడుదల కానున్న ఈ సాంగ్ కోసం మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Advertisement

Next Story