బన్నీ మోసం చేశాడు.. పవన్ కళ్యాణ్ గారు ఆదుకోండి.. యువతి వేడుకోలు

by Mahesh |   ( Updated:2022-03-21 12:01:42.0  )
బన్నీ మోసం చేశాడు.. పవన్ కళ్యాణ్ గారు ఆదుకోండి.. యువతి వేడుకోలు
X

దిశ, ఏపీ బ్యూరో: ప్రముఖ నిర్మాత బన్నీ వాసు తనను మోసం చేశాడంటూ బోయ సునీత అనే మహిళ గుంటూరు జిల్లా మంగళగిరి లోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద నిరసనకు దిగింది. జనసేన పార్టీ నాయకుడు, నిర్మాత బన్నీ వాసు తనను నమ్మించి వాడుకొని వదిలేశాడని.. తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దృష్టికి నాకు జరిగిన అన్యాయాన్ని తీసుకువెళ్లాలని ఉద్దేశంతో రాష్ట్ర పార్టీ కార్యాలయంకు వచ్చానని తెలిపింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పనిచేయాలని బన్నీ వాసు సూచించాడని.. తాను అలాగే చేసినట్లు బోయ సునీత తెలిపారు.

ఆ సమయంలోనే గీతా ఆర్ట్స్‌లో సినిమాలు ఇప్పిస్తానని, పెళ్లిచేసుకుంటానని నమ్మించి బన్నీ వాసు తనను లైంగికంగా వాడుకున్నాడని సునీత ఆరోపించింది. తాను జనసేన పార్టీకోసం పనిచేశాను కాబట్టి అధ్యక్షులు పవన్ కల్యాణ్‌కు గోడు చెప్పుకోడాలని మంగళగిరి జనసేన ఆఫీస్ కు వచ్చినట్లు బోయ సునీత తెలిపారు. అయితే ఆఫీస్ సిబ్బంది తనను లోపలికి రానివ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని పవన్ కల్యాణ్‌కు విజ్ణప్తి చేస్తూ.. జనసేన కార్యాలయం బయట సునీత నిరసన చేపట్టింది.

గతంలోనూ ఇదే పరిస్థితి

ఇకపోతే సినీ ప్రొడ్యూసర్‌ బన్నీవాసు తనకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేసారంటూ జూనియర్‌ ఆర్టిస్ట్‌ సునీత బోయ కొన్నిరోజులుగా ఫైట్ చేస్తున్న విష‌యం తెలిసిందే. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడని..అనంతరం అబార్షన్ చేయించాడని బోయ సునీత సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు నిర్మాత బన్నీ వాసుపై అనంతపురం జిల్లా ఎస్పీకి సైతం ఫిర్యాదు చేసింది. తనకు డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం చేశారని.. అంతేకాకుండా… అబార్షన్ కూడా చేయించారని.. ఇదే విషయంపై రెండేళ్లుగా తనకు న్యాయం చేయాలని పోరాడుతున్నట్లు ఆమె ఆరోపించింది.

తెలంగాణ పోలీసులను బన్నీ వాసు మానేజ్ చేస్తున్నారని ఆరోపించింది. అనంతరం గీతా ఆర్ట్స్ కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకోవడం ఒక ఆస్పత్రిలో చికిత్స చేయించిన సంగతి తెలిసిందే. అనంతరం మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. ఎవరికైనా మహిళలకు అన్యాయం జరిగితే ముందుంటానని మంచు విష్ణు హామీ ఇచ్చారని ఇప్పుడు తనకు జరిగిన అన్యాయంపై విష్ణు స్పందించాలని.. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని బోయ సునీత కోరిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story