నేను ఆత్మహత్యకు సిద్ధం.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన సవాల్

by Vinod kumar |
నేను ఆత్మహత్యకు సిద్ధం.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన సవాల్
X

దిశ ప్రతినిధి, సంగారెడ్డి: గతాన్ని మరచిపోయి నీతులు మాట్లాడుతున్నావా..? అవినీతికి కేరాఫ్​ నువ్వు. నిన్ను చూసి ఊసరవెల్లి సిగ్గుపడుతుంది. అభివృద్ధి చూసి ఓర్వలేక ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నావ్.. నేను గజం భూమి కబ్జా చేసినట్లు నిరూపిస్తే పటాన్​చెరు పోలీస్​స్టేషన్​ ఎదుట ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమని మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్​గౌడ్ పై పటాన్​చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్​రెడ్డి ఫైర్​ అయ్యారు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం. ఖబర్దార్​అని హెచ్చరించారు. ఎమ్మెల్యేతో పాటు అతని కుటుంబ సభ్యులు భూకబ్జాలకు పాల్పడుతున్నట్లు ఇటీవల నందీశ్వర్​గౌడ్​ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై మహిపాల్​రెడ్డి తీవ్రంగా

స్పందించారు. గురువారం పటాన్​చెరు జీఎంఆర్​కన్వెన్షన్​ హాలులో టీఆర్ఎస్​ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పటాన్​చెరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక నందీశ్వర చిల్లర రాజకీయాలకు పాల్పడడం చూస్తుంటే అసహ్యం వేస్తోందని మండిపడ్డారు. రాజకీయంగా ఆరోపణలు చేయడంలో తప్పలేదని ఊసరవెల్లులు సిగ్గుపడేలా నందీశ్వర్​గౌడ్​ చేస్తున్న ఆరోపణలు సహించరానివన్నారు. గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అవినీతి, అక్రమాలు నియోజకవర్గ ప్రజలు ఇంకా మరువ లేదని ఆరోపించారు.


ఎమ్మెల్యే అన్న గౌరవంతో నీకు జమానతు ఉన్న ఓ అధికారి ఆస్తులు అమ్ముకునే పరిస్థితులు తెచ్చింది నువ్వు కాదా..? అని గతాన్ని గుర్తు చేశారు. నందీశ్వర్​ అవినీతి, అక్రమాలు చెప్పుకుంటూ పోతే మహాభారతం రాయాల్సి వస్తుందని మహిపాల్​రెడ్డి ఎద్దేవా చేశారు. పటాన్​చెరు నియోజకవర్గ పరిధిలో ఎక్కడ కూడా తాను గజం భూమి కబ్జా చేసినట్లు నిరూపిస్తే స్థానిక పోలీస్ స్టేషన్ దగ్గర ఆత్మహత్యకు తాను సిద్ధమేనని గూడెం సవాల్ విసిరారు. దమ్ము, ధైర్యం ఉంటే రాబోయే ఎన్నికల్లో బీజేపీ నుంచి టికెట్ తెచ్చుకోవాలని సూచించారు.


టీఆర్ఎస్ నుంచి సామాన్య కార్యకర్తను గెలిపించుకునే సత్తా తమకు ఉందన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఆరోపణలు చేయాలే తప్ప, నోరుందని అసంబద్ధ ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలనీ, వారి ఆకాంక్షలకు అనుగుణంగా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళుతున్నామని చెప్పారు. ఇకనైనా సంకుచిత రాజకీయాలు మానుకుని, నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మహిపాల్​రెడ్డి సూచించారు.

Advertisement

Next Story