- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Padi Kaushik Reddy: ఈటల రాజేందర్‌పై కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
దిశ, హుజూరాబాద్ రూరల్: Padi Kaushik Reddy demands Eatala Rajender to Open Debate About Huzurabad Development| హుజురాబాద్ అభివృద్ధిపై ఈటల రాజేందర్ అంబేద్కర్ చౌరస్తాలో బహిరంగ చర్చకు సిద్ధమా అని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు. మంగళవారం పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈటల రాజేందర్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి హుజురాబాద్‌కు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎనిమిది నెలల్లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు హుజురాబాద్‌ని అన్ని రంగాలల్లో అభివృద్ధి చేశారని తెలిపారు.
2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఈటల రాజేందర్ హుజురాబాద్‌కు, ఇక్కడ ఎవరికీ తెలియదని, ఆయనకు ముఖ్యమంత్రి పదవి తప్పా అన్ని పదవులు అనుభవించే స్థాయి కేసీఆర్ ఇచ్చారని, అయినా సీఎంకు వెన్నుపోటు పొడిచారని వ్యాఖ్యనించారు. ఆర్థికశాఖ మంత్రిగా ఉన్నప్పుడు వందలాది ఎకరాల పేదల భూములను ఆక్రమిస్తే వాటిని పంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఉప ఎన్నికల్లో మీ కన్న కొడుకును సాధు కొంటారో చంపుకుంటారో అని ప్రగల్బాలు పలికిన ఈటల రాజేందర్ గెలిచిన తర్వాత గజ్వేల్‌లో పోటీ చేస్తానని చెబుతూ హుజురాబాద్ ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. దమ్ము, ధైర్యం ఉంటే హుజురాబాద్‌లో పోటీ చేయాలని, ఈటల రాజేందర్ గెలిస్తే ముక్కు నేలకు రాస్తానని కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు. మూడు రోజుల్లో అంబేద్కర్ చౌరస్తా వద్ద హుజురాబాద్ అభివృద్ధిపై చర్చకు రాకపోతే ఈటల రాజేందర్ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదని ఒప్పుకున్నట్లేననే ఆయన అన్నారు.
ఇది కూడా చదవండి: వాయిదా పడిన జనంగోస- బీజేపీ భరోసా కార్యక్రమం