- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీలో మాంసం నిషేధం పై ఫైర్ అయిన ఒవైసీ
దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో దేవీ నవరాత్రుల సందర్భంగా మాంసం విక్రయించాడాన్ని SDMC నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఎమ్ఐఎమ్ ఎంపీ ఒవైసీ స్పందించారు. మాంసాన్ని కేవలం ఆహారం గా మాత్రమే చూడాలని అన్నారు. మాంసం తినాలా వద్దా అనేది ప్రజల అభిప్రాయం, అది ప్రజలే నిర్ణయించుకుంటారని అన్నారు. మాంసం నిషేధిస్తే దానిపై ఆధార పడిన వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంది.. ఆ నష్ట పరిహారాన్ని ఎవరు తీరుస్తారని ప్రశ్నించారు. మాంసం అనేది.. వెల్లుల్లి, ఉల్లి వంటి ఆహారం లాంటిదే అని అభిప్రాయ పడ్డారు. అలాగే మోడీ ప్రభుత్వ విధానాలపై కూడా ఒవైసీ విరుచుకుపడ్డారు.
దక్షిణ ఢిల్లీ SDMC మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ముఖేష్ సూర్యన్ మాట్లాడుతూ.. దేవీ నవరాత్రులలో ఢిల్లీ ప్రజలోని చాలా కుటుంబాలు వెల్లుల్లి, ఉల్లిపాయలు కూడా తినరని.. వాటి వాసన చూడటానికి కూడా ఇష్టపడరని వ్యాఖ్యానించారు. అలాగే త్వరలోనే మాంసం దుకాణాలు మూసివేతకు అధికారిక ఉత్తర్వులు ఇస్తామని.. మంగల వారం నుంచి దుకాణాలు ముసివేయ బడతాయని SDMC మేయర్ సూర్యన్ అన్నారు.
ఈ మేరకు SDMC కమీషనర్ జ్ఞానేష్ భారతికి సూర్యన్ ఓ లేఖ రాశారు. నవరాత్రి సందర్భంగా దుర్గామాత పూజలు చేసేందుకు వెళ్లే మార్గ మద్యమంలో మాంసం దుకాణాలు ఉంటే భక్తుల మతపరమైన నమ్మకాలు దెబ్బతింటాయని లేఖలో పేర్కొన్నారు. సూర్యన్ తన నిర్ణయానికి గల కారణాలు వివరిస్తూ, దుర్గామాత భక్తులు తొమ్మిది రోజుల పాటు కఠినమైన శాఖాహార ఆహారం తో పాటు మాంసాహార పదార్థాలు, మద్యం, కొన్ని సుగంధ ద్రవ్యాల వాడకానికి దూరంగా ఉంటారని చెప్పారు.