పీఎంకేఎస్‌వై ద్వారా 29 లక్షలకు పైగా రైతులకు ప్రయోజనం

by Vinod kumar |
పీఎంకేఎస్‌వై ద్వారా 29 లక్షలకు పైగా రైతులకు ప్రయోజనం
X

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 29 లక్షలకు పైగా రైతులు ప్రధాన్ మంత్రి కిసాన్ సంపద యోజన(పీఎంకేఎస్‌వై) అనుబంధ పథకాల ద్వారా ప్రయోజనం పొందారని కేంద్రం తెలిపింది. శుక్రవారం రాజ్యసభలో ఎంపీ వికాస్ మహత్మా అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ రాతపూర్వక సమాధానమిచ్చారు. దేశవ్యాప్తంగా 20 మెగా ఫుడ్ పార్క్ లు ఉన్నాయని, మరో 41 పార్క్ లకు ఆమోదం పొందాయని తెలిపారు.


దేశంలో 258 ఇంటిగ్రేటెడ్ కోల్డ్ చెయిన్‌లు పూర్తవడం లేదా ప్రారంభించగా, మరో 349 మంజూరు అయ్యాయని చెప్పారు. దీనికోసం సంబంధిత కాంపోనెంట్ స్కీమ్‌లకు అధ్యయనాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ అధ్యయనాలు కాంపోనెంట్ స్కీమ్‌లు రైతులకు గణనీయమైన ప్రయోజనంతో వాటి లక్ష్యాలను సాధించేలా నిర్ధారించాయని అన్నారు. పీఎంకేఎస్‌వై ద్వారా 28,49,945 మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. 2025-2026 ఆర్థిక సంవత్సరం నాటికి దేశంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 5,44,432 మందికి ఉపాధి కల్పించనుంది.

Advertisement

Next Story

Most Viewed