50MP కెమెరాతో బడ్జెట్ ధరలో మార్కెట్లోకి Oppo K10

by Harish |
50MP కెమెరాతో బడ్జెట్ ధరలో మార్కెట్లోకి Oppo K10
X

దిశ,వెబ్‌డెస్క్: చైనా కంపెనీ Oppo కొత్త మోడల్ Oppo K10 స్మార్ట్ ఫోన్‌ను త్వరలో ఇండియాలో లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ 6nm స్నాప్‌డ్రాగన్ 680 SoC ద్వారా పనిచేస్తుంది. హోల్-పంచ్‌తో పాటు ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది.

స్పెసిఫికేషన్స్ (అంచనా)

-ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల పూర్తి-HD (1,080x1920 పిక్సెల్‌లు) LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

-హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 11లో ColorOS 11.1తో రన్ అవుతుంది.

- 6nm స్నాప్‌డ్రాగన్ 680 SoC ద్వారా పనిచేస్తుంది.

-6GB RAM 128GB మెమరీతో వస్తుంది. మైక్రో SD కార్డు ద్వారా మెమరీని పెంచుకోవచ్చు.

- 50MP ప్రైమరీ కెమెరా తో పాటు 2MP డెప్త్, 2MP మాక్రో కెమెరాలు ఉంటాయి.

-సెల్ఫీల కోసం 16MP కెమెరా ఉంటుంది.

- 33W ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

Oppo K10 మార్చి 23 నుంచి అమ్మకానికి అందుబాటులో ఉండనుంది. ఫోన్ ధర రూ.20,000లోపు ఉండే అవకాశం ఉంది.

Advertisement

Next Story