- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Samantha: ‘అప్పుడే అలాంటి వారికి సరైన సమాధానం చెప్పొచ్చు’.. దుమారం రేపుతున్న సమంత పోస్ట్
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత మయోసైటీస్ వ్యాధి బారిన పడి దాదాపు ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంది. అలా సంవత్సరం పాటు ఆరోగ్యం పై ఫోకస్ పెట్టిన ఈ బ్యూటీ.. తాజాగా సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్‌తో మనముందుకు వచ్చింది. నవంబర్ 7నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. అలాగే మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తోంది. కాగా ఈ చిత్రాన్ని సామ్ సొంతంగా తెరకెక్కిస్తుండటం విశేషం. అయితే ఈ భామ ఓ వైపు సినిమాలు చేస్తునే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో సమంత పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
తాజాగా సమంత ఇన్‌స్టా వేదికగా ఓ పోయమ్‌ను(పద్యం) పోస్ట్ చేస్తూ.. ‘ఈ పద్యం నాకెప్పుడు మార్గదర్శకంగా ఉంది. ఈ రోజు ఈ పద్యాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను’ అంటూ రాసుకొచ్చింది. మరి అసలు పద్యం మీనింగ్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. ‘మీరు రిస్క్‌తో ఏదైనా కొత్త పని చేసి ఓడిపోతే.. మళ్ళీ ప్రయాణాన్ని కొత్తగా మొదలు పెట్టాలి. అంతేకానీ ఆ ఓటమి గురించే ఆలోచిస్తూ కూర్చోకూడదు. మనల్ని స్ట్రాంగ్ చేసుకుని మరింత ధైర్యంగా ముందుకు వెళ్లాలి. మీ దగ్గర ఏం లేకపోయినా సరే సంకల్పాన్ని గట్టిగా పట్టుకోండి.. అప్పుడే మనల్ని నిందించే వారికి సరైన సమాధానం చెప్పొచ్చు’ అనే అర్థంతో ఈ పద్యం ఉంది. ప్రస్తుతం ఈపోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీనిని చూసిన అభిమానులు సామ్‌కు సపోర్ట్‌గా కామెంట్స్ చేస్తుంది.