- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఫుడ్‌సేప్టీ ఆఫీసర్లకు షాక్.. వంట నూనెల కల్తీపై తీవ్ర ఆందోళన
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సంస్థలు ఉత్పత్తి చేస్తున్న వంట నూనెల్లో కల్తీ జరుగుతున్నట్లు ఫుడ్‌సేప్టీ అండ్స్టాండర్స్అధారిటీ ఆఫ్ఇండియా అనుమానం వ్యక్తం చేస్తుంది. ఈ మేరకు రాష్ట్రంలోని 98 ఉత్పత్తి కంపెనీల నుంచి శాంపిల్స్ సేకరించి టెస్టులు నిర్వహిస్తున్నది. ప్రాథమిక రిపోర్టులో 90% శాంపిల్స్‌లో కల్తీ జరిగినట్లు తేలింది. ఫైనల్పరీక్షల కొరకు పుడ్ టెస్టింగ్ల్యాబ్లలో పరీక్షలు జరుగుతున్నట్లు ఆఫీసర్లు వెల్లడించారు. రష్యా, ఉక్రెయిన్ తర్వాత కల్తీ ఆయిల్స్ పెరిగిపోయినట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రజలంతా కంపెనీతో పాటు ప్రమాణాల నాణ్యతను కూడా తెలుసుకొని ఆయిల్ కొనుగోలు చేయాలని ఫుడ్‌సేప్టీ ఆఫీసర్లు సూచిస్తున్నారు. మరోవైపు కొన్ని ఆయిల్ కంపెనీల్లో ర్యాండమ్‌గా శాంపిళ్లు తీసుకొని రాసిడిటీ (ఆయిల్ లో స్టాండర్స్) ఎంత వరకు ఉన్నాయనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నారు. దీంతో పాటు టీ పౌడర్శాంపిళ్లను కూడా చెక్చేయనున్నారు.
ఆకస్మిక తనిఖీలు...
రాష్ట్ర వ్యాప్తంగా ఇక నుంచి ఫుడ్‌సేప్టీ ఆఫీసర్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నారు. బేకరీలు, హోటళ్లు, రెస్టారెంట్లు, స్ట్రీట్ఫుడ్సెంటర్లు, కేఫ్‌లు, కూల్డ్రింక్షాపులు తదితర చోట ఆకస్మిక తనిఖీలు చేయనున్నారు. ఎక్కడికక్కడ శాంపిళ్లను పరీక్షించేందుకు మొబైల్ టెస్టింగ్ ల్యాబ్‌ను వెంట తీసుకువెళ్లనున్నారు. ఈ మేరకు ప్రత్యేక టీమ్‌లు ఏర్పడి తనిఖీలు చేసేందుకు ఫుడ్‌సేప్టీ అధారిటీ సిద్ధమైంది.