- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉదయాన్నే ట్రైనింగ్ మొదలు పెట్టాలని?
బర్మింగ్‌హామ్: ఇండియన్ బాక్సర్ లవ్లీనా బోర్గాహైన్‌కు చేదు అనుభవం ఎదురైంది. అలెగ్జాండర్ స్టేడియంలో కామన్‌వెల్త్ గేమ్స్ ఓపెనింగ్ వేడుకలు జరిగాయి. ఈ వేడుక మధ్యలోనే బాక్సర్ లవ్లీనా బయటికి వచ్చేశారు. మరుసటి రోజు మ్యాచ్ ఉండటంతో విలేజ్‌కి త్వరగా చేరుకుని.. ఉదయాన్నే ట్రైనింగ్ మొదలు పెట్టాలని అనుకున్నారు. దీంతో మరో బాక్సర్ మహ్మద్ హుసాముద్దీన్‌తో కలిసి గేమ్స్ విలేజ్‌కు వెళ్లాలని అనుకున్నారు. దీంతో మొదటగా ట్యాక్సీ కోసం నిర్వాహకులకు అడిగారు. డ్రైవర్ అందుబాటులో లేరని చెప్పడంతో బస్సు కోసం బర్మింగ్ హోమ్ వీధుల్లోనే గంటపాటు వేచి ఉన్నారు. విలేజ్‌కు ఎలా వెళ్లాలో తెలియక ఇద్దరూ మార్గమధ్యలోనే చిక్కుకున్నట్లు బాక్సర్ లవ్లీనా ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఈ విషయంపై సీడీఎం రాజేష్ భండారీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇద్దరు బాక్సర్లు వేడుక మధ్యలో వెళ్లినట్లు తనకు తర్వాత తెలిసిందని ఆరోపించారు. ట్రైనింగ్ కోసం చాలా మంది అథ్లెట్లు వేడుకలకు హాజరు కాలేదన్నారు. దీనిపై బాక్సింగ్ టీమ్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు.