Nupur Sharma: నుపూర్ శర్మకు సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్

by GSrikanth |   ( Updated:2022-07-19 10:54:35.0  )
Nupur Sharma not to be Arrested till august 10, Orders Supreme Court
X

దిశ, వెబ్‌డెస్క్: Nupur Sharma not to be Arrested till august 10, Orders Supreme Court| మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. నుపూర్ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఆగస్ట్ 10 వరకు నుపూర్ శర్మను అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను ఆగస్టు 10కి వాయిదా వేసింది. కాగా, మమ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు మందలించిన తర్వాత తనకు ప్రాణహాని మరింత పెరిగిందని నుపూర్ శర్మ ఆందోళన వ్యక్తం చేసింది. రేప్ చేస్తామని, హత్య చేస్తామని బెదిరింపులు వస్తున్నాయనని ఆవేదన చెందారు. అలాగే భద్రతా కారణాల చేత తనపై వేర్వేరు రాష్ట్రాల్లో నమోదైన కేసులు అన్నింటిని కలిపి విచారించాలని సుప్రీం కోర్టులో నుపుర్ శర్మ మరోసారి పిటిషన్ దాఖలు చేయగా మంగళవారం ఆ పిటిషన్‌ను ధర్మాసనం విచారించించిన అనంతరం తాజా ఆదేశాలను జారీ చేసింది.

ఇది కూడా చదవండి: సర్వీస్‌లో గాయపడితేనే ఆర్మీ వైకల్య పెన్షన్ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

Advertisement

Next Story

Most Viewed