విద్యాశాఖ మంత్రి ఇంటి ముట్టడికి ఎన్ఎస్‌యూఐ యత్నం

by Mahesh |   ( Updated:2022-08-11 07:24:56.0  )
విద్యాశాఖ మంత్రి ఇంటి ముట్టడికి ఎన్ఎస్‌యూఐ యత్నం
X

దిశ, డైనమిక్ బ్యూరో : విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు ఎన్ఎస్‌యూఐ నేతలు ప్రయత్నించారు. ఈ నెల 15న బాసర ఐఐఐటీలో ఫుడ్ పాయిజన్ అయిన విషయం తెలిసిందే. సెకండర్ ఇయర్ చదువుతున్న ఐఐఐటీ విద్యార్థి సంజయ్ మృతి చెందాడు. ఈ నేపథ్యంలో సంజయ్ మరణానికి దారి తీసిన ఐఐఐటీ బాసరలోని సమస్యలపై చర్యలు తీసుకోకపోవడంతో.... నేడు ఎన్ఎస్‌యూఐ సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముందు ఆందోళనలు చేపట్టింది. వెంటనే పోలీసులు కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపైనే బైఠాయించి నిరసనలు తెలిపారు. ఫుడ్ పాయిజన్‌పై ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని, విద్యార్థుల కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలి & ఫుడ్ పాయిజనింగ్ సమస్యలపై దర్యాప్తు చేయడానికి సిట్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవస్థను పునర్నిర్మించడం, జవాబుదారీతనం, పారదర్శకతతో వ్యవస్థను మెరుగుపరచడం ద్వారా ఈ సమస్యలను నివారించడానికి ప్రభుత్వం అన్ని అవసరమైన చర్యలను తీసుకోవాలని ఎన్ఎస్‌యూఐ స్టేట్ ఛీఫ్ వెంకట్ బల్మూరి కోరారు. అడ్మినిస్ట్రేషన్ విషయాలలో కాలేజీ స్టూడెంట్స్ యూనియన్లు, విద్యార్థులు లేవనెత్తిన అంశాలను(డిమాండ్లను) వెంటనే పరిష్కరించాలని ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed