- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వృద్ధిమాన్ సాహా కామెంట్స్‌పై ద్రావిడ్ స్పందన!
న్యూఢిల్లీ: సీనియర్ క్రికెటర్ వృద్ధిమాన్ సాహా కెరీర్‌పై టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌లో అవకాశం వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న వృద్ధిమాన్ సాహా ను ఇక రిటైర్మెంట్ పై ఆలోచన చేయాలని ద్రావిడ్ వ్యాఖ్యలు చేయడంతో క్రికెటర్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఈ విషయాన్ని జాతీయ మీడియాకు వివరించడంతో పలువురు నెటిజన్లతో పాటు మాజీ క్రికెటర్ సెహ్వాగ్ కూడా సాహాకు మద్దతుగా నిలిచాడు.
తాజాగా మీడియాలో వస్తున్న కథనాలకు రాహుల్ ద్రావిడ్ స్పందించాడు. సాహా విషయంలో తనపై వస్తున్న ఆరోపణలకు నేనేమీ బాధపడటం లేదు. సాహా తన కెరీర్‌లో సాధించిన విజయాలపై నాకు గౌరవం ఉంది. అతన్ని జట్టు నుంచి తొలగిస్తున్నట్టు మీడియా వస్తున్న కథనాలను ద్రవిడ్ తప్పుబట్టారు. క్రికెట్‌లో కొన్ని సార్లు ఆటగాళ్లతో ఇటువంటి కఠినమైన సంభాషణలు జరగడం సర్వసాధారణమే' అని ద్రావిడ్ వివరించారు.