- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చీటింగ్ కేసులో.. అమీషా పటేల్
దిశ,సినిమా: బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అమీషా పటేల్ ప్రస్తుతం అడపదడపా మాత్రమే సినిమాల్లో కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. 2018లో ఓ ఫ్రాడ్ కేసుకు సంబంధించి హాజరవాల్సిందిగా మొరాదాబాద్ కోర్టు తాజాకు అమీషాకు నోటీసు జారీ చేసింది. ఈ నెల 19న ఆమె కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా.. ఉల్లంఘించడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది కోర్టు. విషయానికొస్తే.. మొరాదాబాద్‌కు చెందిన ఒక ఈవెంట్ కంపెనీ 2017లో నిర్వహించిన ఓ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేసేందుక నిర్వాహకుల నుంచి రూ. 16 లక్షలు తీసుకుంది. కానీ ఆ ప్రోగ్రామ్‌కు అమీషా హాజరవలేదు. ఈ విషయంపై ఈవెంట్ నిర్వాహకులు ఆమెను సంప్రదించినప్పటికీ స్పందన లేకపోవడంతో పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు. దీంతో పోలీసులు అమీషా పటేల్‌తో పాటు మరో ఇద్దరు అసోసియేట్స్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 20వ తేదీకి వాయిదా వేశారు.