కశ్మీర్ పండిట్లపై కీలక వ్యాఖ్యలు RSS చీఫ్ మోహన్ భగవత్

by Vinod kumar |   ( Updated:2022-04-03 10:12:21.0  )
కశ్మీర్ పండిట్లపై కీలక వ్యాఖ్యలు RSS చీఫ్ మోహన్ భగవత్
X

శ్రీనగర్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీరీ పండిట్లు తిరిగి వచ్చినప్పుడు వారిని ఎవరూ నిరాశ్రయులు కాలేరని ఆయన అన్నారు. కశ్మీర్ పర్వదినం నవ్రే వేడుక సందర్భంగా ఆదివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. 'కశ్మీరీ పండిట్లు తమ ఇళ్లకు తిరిగి వచ్చే రోజు చాలా దగ్గర్లోనే ఉందని నేను భావిస్తున్నాను. ఆ రోజు త్వరగా రావాలని కోరుకుంటున్నాను' అని అన్నారు. కశ్మీరీ పండిట్లకు భద్రత, జీవనోపాధికి హామీ ఇవ్వడంతో తిరిగి వెళ్తారని భగవత్ అన్నారు.


'ఉగ్రవాదం కారణంగా మనం కశ్మీర్‌ను విడిచిపెట్టాం. కానీ ఇప్పుడు మన భద్రత, జీవనోపాధికి హామీ ఇవ్వడంతో హిందువులుగా, భరత భక్తులుగా తిరిగి వెళ్దాం' అని కశ్మీర్ పండిట్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మనల్ని ఈ ప్రాంతం నుంచి వేరు చేయడానికి ఎవరూ సాహసించని విధంగా నివసిస్తామని చెప్పారు. కశ్మీర్ ఫైల్స్ చిత్రం ద్వారా దర్శకుడు వాస్తవాలను కళ్లకు కట్టినట్లు చూపించారని తెలిపారు. కొందరు సానుకూలంగా, మరికొందరు వ్యతిరేకించినప్పటికీ, వాస్తవాలను మాత్రం తెరపైకి తీసుకొచ్చాయని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed