Nithya Menen: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నిత్యా మీనన్..

by Manoj |   ( Updated:2022-07-21 08:58:37.0  )
Nithya Menen refutes Her Marriage Rumours
X

దిశ, సినిమా: Nithya Menen refutes Her Marriage Rumours| కొద్ది రోజులుగా నిత్యా మీనన్ పెళ్లిపీటలు ఎక్కబోతుందని వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో రూమర్స్‌కు ఫుల్‌స్టాప్ పెట్టింది మలయాళీ కుట్టి. తాను ఎవ‌రితో ప్రేమ‌లో లేన‌ని, పెళ్లి చేసుకోవ‌డం లేద‌ని క్లారిటీ ఇచ్చింది.

నిజానిజాలు నిర్ధారించుకున్న త‌ర్వాత వార్తలు ప్రచురిస్తే బాగుంటుందని ఫైర్ అయింది. ఇక కెరీర్ ఆరంభం నుంచి క‌మ‌ర్షియ‌ల్ క్యారెక్టర్స్‌, గ్లామ‌ర్ రోల్స్‌కు దూరంగా ఉంటూ న‌ట‌న‌కు ఆస్కార‌మున్న పాత్రల్లోనే నటిస్తున్న నిత్యామీన‌న్‌.. ఇటీవల భీమ్లా నాయక్, మోడ్రన్ లవ్ హైదరాబాద్ వెబ్‌సిరీస్‌ల్లో క్యారెక్టర్స్‌తో మెప్పించింది.

ఇది కూడా చదవండి: 'దర్జా'తో కష్టానికి తగిన ఫలితం దక్కుతుందన్న మేకర్స్..


Advertisement

Next Story