గుప్త నిధుల గుట్టు రట్టు.. తొమ్మిది మంది అరెస్ట్..

by Vinod kumar |
గుప్త నిధుల గుట్టు రట్టు.. తొమ్మిది మంది అరెస్ట్..
X

దిశ, జఫర్‌గడ్: మండల కేంద్రంలో గుప్త నిధులు తవ్వకానికి బయ్యారం నుంచి వచ్చిన తొమ్మిది మంది గుప్తనిధుల ముఠా సభ్యులను అరెస్టు చేసి వారి నుంచి రెండు కార్లు, తవ్వకాలకు ఉపయోగించే సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వర్ధన్నపేట సీఐ సదన్ కుమార్, స్థానిక ఎస్ఐ మాధవ్ తెలిపారు. మంగళవారం విలేకరుల సమావేశంలో పోలీసులు మాట్లాడుతూ.. జనగామ జిల్లా జఫర్‌గడ్ మండలం కేంద్రంలోని పాతూర్ లో గల (గంటల గుడి అని పిలువబడే) శివాలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేయడానికి బయ్యారానికి చెందిన తొమ్మిది మంది సోమవారం రాత్రి మండల కేంద్రానికి చేరుకొని కోటలో అనుమానస్పదంగా తిరుగుతున్నారు. స్థానిక ఎస్ఐ మాధవ్ సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా వారిని గమనించి అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా.. గుప్త నిధుల తవ్వకాల కోసం బయ్యారం నుండి వచ్చినట్లు విచారణలో వారు చెప్పినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ కనక స్వామి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.



Advertisement

Next Story