NIA Searches: నర్సింగ్ స్టూడెంట్ మిస్సింగ్ కేసు.. హైకోర్టు న్యాయవాది ఇంట్లో NIA సోదాలు

by GSrikanth |   ( Updated:2022-06-23 07:27:49.0  )
NIA Searches In Telangana High Court Advocate Shilpa House
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: NIA Searches In Telangana High Court Advocate Shilpa House| ఉప్పల్‌లోని హైకోర్టు అడ్వకేట్ శిల్ప ఇంట్లో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) సోదాలు చేస్తున్నారు. నాలుగున్నర ఏళ్ల క్రితం క్రితం మెడికల్ స్టూడెంట్ రాధ అదృశ్యమవ్వగా, విశాఖపట్నంలో మిస్సింగ్ కేసు నమోదైంది. రాధను మావోయిస్టుల్లోకి చేర్చారని శిల్పపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో శిల్పను అదుపులోకి తీసుకున్న జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఆమె నివాసంతో పాటు ఏకకాలంలో మూడు చోట్ల సోదాలు చేస్తున్నారు. పర్వతపురంలోని దేవేంద్ర ఇంటితో పాటు అంబేద్కర్ పూలే యువజన సంఘం అధ్యక్షుడు బండి కిరణ్ ఇంట్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. అంతేగాక, మెదక్ జిల్లా చేగుంటలోనూ ఎన్‌ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. చేగుంటలోని మావోయిస్టు పార్టీ అగ్రనేత దుబాషి శంకర్ కుమారుడు దేవేందర్ ఇంట్లో సోదాలు జరుపుతున్నారు.

కాగా, తమ కూతురు కిడ్నాప్‌నకు గురైందంటూ.. 2017 డిసెంబర్‌లో ఏపీలో విశాఖలోని పెదబయలు పోలీస్‌ స్టేషన్‌లో రాధ తల్లి ఫిర్యాదు చేసింది. మావోయిస్టు అనుబంధ సంస్థ అయిన సీఎంఎస్​నాయకులు కిడ్నాప్ చేసి.. రాధను బలవంతంగా మావోయిస్టు పార్టీలో చేర్చుకున్నారని ఆరోపించింది. కాగా, సీఎంఎస్​నాయకులు దేవేంద్ర, స్వప్న, శిల్ప తమ ఇంటికి వచ్చేవారని ఆమె వెల్లడించింది. వైద్యం పేరుతో దేవేంద్ర తమ కూతురిని తీసుకెళ్లారని రాధ తల్లి ఫిర్యాదు చేసింది. రాధ అదృశ్యంపై విశాఖపట్నంలో మిస్సింగ్ కేసు నమోదు కాగా.. రాధను నక్సల్స్‌లో చేర్చారని అడ్వకేట్‌ శిల్పపై ఆరోపణలు వచ్చాయి. దీంతో నర్సింగ్ విద్యార్థిని రాధ కేసు ఎన్ఐఏకు అప్పగించారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని చేగుంట, ఉప్పల్‌‌తో పాటు పలుచోట్ల ఎన్ఐఏ సోదాలు జరుపుతోంది.

Advertisement

Next Story

Most Viewed