- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Twitter: మొట్టమొదటి ట్విట్టర్ పోస్ట్ వేలం.. ఎంత పలికిందో తెలుసా?!
దిశ, వెబ్‌డెస్క్ః ఒక్కోసారి మనమొకటి తలిస్తే ఇంకోటేదో జరిగిపోద్ది.. చేసేదేముండదు కనుక, సర్థుకుపోవాల్సిందే మరి! క్రిప్టో వ్యవస్థాపకుడు సినా ఎస్టావి విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఏడాది క్రితం సినా ఎస్టావి, ట్విట్టర్ యజమాని జాక్ డోర్సే పెట్టిన మొదటి ట్వీట్‌ను వెలుగులోకి తీసుకొచ్చాడు. ప్రజల క్రేజీ మైండ్ తెలుసు గనుక, ఆ మొట్టమొదటి ట్వీట్‌ను అమ్మకానికి పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అయితే, ఇక్కడ తన అంచనా తారుమారయ్యింది.
ట్విట్టర్ యజమాని జాక్ డోర్సే మొదటి ట్వీట్‌ను NFT (నాన్-ఫంగబుల్ టోకెన్) కింద 64 మిలియన్ డాలర్లకు విక్రయించాలని అనుకున్నాడు. ఉత్సాహంగా వేలం వేయగా ఆ ట్వీట్ అత్యధిక బిడ్ కేవలం 375 డాలర్లకే అమ్ముడుపోయింది. మే 21, 2006 నాటి ఈ ట్వీట్‌ను ఎస్టావీ NFTలో 3.88 మిలియన్ల ఆస్ట్రేలియన్ డాలర్లకు (USD $2.9 మిలియన్) తీసుకున్నాడు. అయితే, తిరిగి అమ్మడానికి, గత వారం వేసిన వేలంలో $64 మిలియన్లు (USD $48 మిలియన్లు) వస్తాయని అంచనా వేశాడు. కనీసం 67 మిలియన్ల ఆస్ట్రేలియన్ డాలర్లు (USD $50 మిలియన్లు) ఆశించాడు. అందులో 50% ఛారిటీకి విరాళంగా ఇస్తాననీ చెప్పాడు. ఏప్రిల్ 13న ముగిసిన వేలంలో మొత్తం 7 ఆఫర్లు రాగా అనుకున్న ఫలితం దక్కలేదు. అయితే, తాజాగా ముగిసిన ఈ బిడ్‌ని ఆమోదించడానికి ఎస్టావికి రెండు రోజుల సమయం ఉంది. రేపటితో గడువు ముగుస్తుంది. CoinDeskతో ఇచ్చిన ఇంటర్వ్యూలో "నాకు మంచి ఆఫర్ వస్తే, అంగీకరించేవాణ్ని, కానీ ఇప్పుడు దాన్ని విక్రయించలేను" అన్నాడు. అవును, కొన్నదాని కంటే 99.99% నష్టానికి ఎవరు అమ్ముకుంటారు..? అయ్యో, కథ అడ్డం తిరిగింది!
I decided to sell this NFT ( the world's first ever tweet ) and donate 50% of the proceeds ( $25 million or more ) to the charity @GiveDirectly
— Estavi (@sinaEstavi) April 6, 2022
🖇 https://t.co/cnv5rtAEBQ pic.twitter.com/yiaZjJt1p0
People are… claiming to "own"… tweets made by other people, because a particular NFT exchange says they do… and then they sell them for $50m… am I speaking accurately? https://t.co/RUa22Hif1U
— Konstantin Boristovich (Rune Arc) 🇺🇦 (@HardSciFiMovies) April 7, 2022
- Tags