- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మార్కెట్లోకి నెక్సస్ కొత్త లగ్జరీ మోడల్ SUV కారు
దిశ, వెబ్‌డెస్క్: లగ్జరీ వాహన తయారీ సంస్థ నెక్సస్ భారత మార్కెట్లో కొత్త SUV మోడల్- Lexus NX 350hని విడుదల చేసింది. 2022 Lexus NX 350h ప్రారంభ వేరియంట్ ధర 64.90 లక్షలు. పెట్రోల్ వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది. దీని ఇంజిన్ హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌ను కలిగి ఉంది. ఈ కారు మూడు వేరియంట్‌లలో లభిస్తుంది. ఎక్స్‌క్విజిట్, లగ్జరీ, F-స్పోర్ట్. ఎక్స్‌క్వైజిట్ ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర రూ. 64.90 లక్షలు, లగ్జరీ వేరియంట్ ధర రూ.69.50 లక్షలు, ఎఫ్-స్పోర్ట్ ధర రూ. 71.60 లక్షలు.
2022 లెక్సస్ NX 350h ఇంజిన్ 2.5-లీటర్ అట్కిన్సన్ సైకిల్ నాలుగు-సిలిండర్ ఇంజన్‌ను కలిగిఉంది. ఇంజిన్ రెండు యాక్సిల్స్‌లో ముందు, వెనుక ఎలక్ట్రిక్ మోటార్‌లతో అమర్చబడి ఉంటుంది. పవర్ అవుట్‌పుట్ 244 hp. ఇంజిన్ 192hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. గేర్‌బాక్స్ 6-స్పీడ్ e-CVT యూనిట్‌ను కలిగి ఉంది. కారు హైబ్రిడ్ యూనిట్ స్వీయ-చార్జింగ్ యూనిట్‌ను కలిగి ఉంటుంది. దీనిని రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. హైబ్రిడ్ యూనిట్ దాదాపు 55 కి.మీ పరిధిని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
దీనిలో 14-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు డ్యూయల్-టోన్ బ్లాక్, రెడ్ థీమ్ ఉంది. SUV Apple CarPlay, Android Auto కనెక్టివిటీ కి సపోర్ట్ చేస్తుంది. ఇతర ముఖ్యమైన ఫీచర్లు పూర్తి-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, 17 స్పీకర్‌లతో కూడిన మార్క్ లెవిన్‌సన్ ఆడియో సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, హెడ్స్-అప్ డిస్‌ప్లే, ఎలక్ట్రికల్‌గా ఫోల్డబుల్ సీట్లు మొదలైన ఫీచర్లు ఉన్నాయి.
భద్రతా కోసం 8 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా, ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, ట్రాక్షన్ కంట్రోల్, EBS, ADAS ఫీచర్లు లేన్ చేంజ్ అసిస్ట్, లేన్-డిపార్చర్ వార్నింగ్ విత్ స్టీరింగ్ అసిస్ట్, రాడార్ ఆధారిత క్రూయిజ్ ఉన్నాయి.