- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోబోలకు కృత్రిమ ఫింగర్ ప్రింట్స్!
దిశ, ఫీచర్స్ : మనుషుల వలె రోబోలకు స్పర్శ జ్ఞానం, ఫీలింగ్స్ వంటి ఫీచర్స్ కల్పించేందుకు పరిశోధకులు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే బ్రిస్టల్ యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్‌కు చెందిన రోబోటిక్స్ & ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చర్ల బృందం యంత్రాలకు స్పర్శను కలిగించే ఫింగర్ టిప్స్‌ను రూపొందించింది. మానవుల చేతి వేళ్లను గమనిస్తే.. ప్రతి వేలి కొనలో ఓ చిన్న బుడిపె లాంటి ఎత్తైన నిర్మాణం ఉంటుంది. అచ్చం అదేరకమైన బంప్‌ను 'టాక్ టిప్'గా పిలువబడే 3D-ప్రింటెడ్ ఫింగర్ టిప్ పైన సృష్టించి, దానికి టచ్ ఆఫ్ సెన్స్(స్పర్శ జ్ఞానం) తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు.
ప్రయోగ ఫలితాల విషయానికొస్తే.. ఇదివరకు వస్తువులు పట్టుకోవడంలో పెద్దగా నైపుణ్యం ప్రదర్శించని రోబోలు, ఇప్పుడు కృత్రిమ న్యూరాన్ల నుంచి వచ్చే సంకేతాల ఆధారంగా స్పర్శ జ్ఞానం తో మరింత మెరుగ్గా వ్యవహరించినట్లు గమనించారు. దీంతో రాబోయే రోజుల్లో కృత్రిమ చేతులకు అమర్చే ఈ టాక్ టిప్స్.. స్పర్శ జ్ఞానం ద్వారా మరింత మెరుగ్గా పనిచేస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ అధ్యయన వివరాలు జర్నల్ ఆఫ్ ది రాయల్ సొసైటీ ఇంటర్‌ఫేస్‌లో తాజాగా ప్రచురితమయ్యాయి.
'రోబోలకు అమర్చే ఫింగర్ టిప్ స్కిన్ కోసం అనేక రకాల సాంకేతికతలు అన్వేషించాం. పనితీరులో నిజమైన చర్మానికి, ఈ టాక్ టిప్ స్కిన్ ఏమాత్రం తీసిపోదు. ఈ 3D-ప్రింటెడ్ ఫింగర్‌టిప్ నిజమైన టచ్ న్యూరాన్స్ నుంచి సంకేతాలను ఉత్పత్తి చేయగలవు. మా పరిశోధన ఆర్టిఫిషియల్ ఫింగర్‌ప్రింట్, మానవ నరాల సంకేతాల మధ్య చాలా దగ్గరి పోలికను కనుగొన్నప్పటికీ, మరికొన్ని అంశాల్లో ఇంకా బెటర్ రిజల్ట్స్ రావాల్సి ఉంది. అందుకోసమే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం. నిజమైన చర్మం కంటే టాక్ టిప్‌ను మరింత మెరుగ్గా చేయడమే మా లక్ష్యం. రోబోటిక్స్ రంగంలో ఇదొక మైలురాయిగా భావిస్తున్నాం' అని పరిశోధకుల బృందం వెల్లడించింది.