- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కూతురి ఆసుపత్రి ఓపెనింగ్ విషయంలో రఘునందన్‌పై నెటిజన్స్ ఫైర్.. తీవ్ర వ్యతిరేకత
దిశ ప్రతినిధి, సంగారెడ్డి: 'అగ్గిపెట్టె మంత్రి అని రోజూ ఎగతాళి చేస్తావు. ఆ అగ్గిపెట్టె మంత్రి వచ్చి అగ్గిపెట్టే వరకు నీ కూతురు దవాఖాన తలుపులు తెరుచుకోకపాయే. షర్టు కూడా మార్చకుండానే రాజకీయాలు మార్చడం నీకే సాధ్యమైంది. ఓ చోట బిడ్డ కోసం ఆరాటం, మరో చోట జనం చూడాలని పోరాటమా..?' అని బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌పై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఊహించని స్థాయిలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఎమ్మెల్యే రఘునందన్‌రావు కూతురు హైదరాబాద్‌లోని అమీర్ పేటలో కొత్తగా ఆసుపత్రిని ప్రారంభించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లు ఈనెల 30న బుధవారం ఆసుపత్రిని ప్రారంభించారు. రఘునందన్‌రావు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని నడింపించారు. ఇదిలా ఉండగా మరుసటి రోజు గురువారం సిద్దిపేట జిల్లా తొగుట మండలం గుడికందులలో రైతు బజారును ఆయన ప్రారంబించారు. ఈ సందర్భంగా స్థానికులు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రఘునందన్‌ను అడ్డుకున్నారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారని.. వాటిని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. పోలీసులు రంగప్రవేశం చేసి రఘునందన్‌రావును పోలీస్ స్టేషన్ కుతరలించారు. అయితే కావాలవే టీఆర్ఎస్కార్యకర్తలు, స్థానికులు అడ్డుకుంటుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారని
ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్టేషన్లోనే రఘునందన్ నిరసనకు దిగారు. పోలీసులపై, టీఆర్ఎస్ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక అక్కడ మొదలైంది సోషల్ మీడియాలో రఘునందన్‌పై విమర్శల దాడి. 'అగ్గిపెట్టె మంత్రి హరీష్‌రావు అని నిత్యం ఆరోపిస్తావు. ఆయన లేనిది మీ కూతురు ఆసుపత్రి ఓపెన్కాలేదా..? తలసానిని పిలుచుకున్నావ్.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎక్కడ.? హైదరాబాద్బీజేపీ రాజాసింగ్గుర్తుకు రాలేదా..? అని నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు. కూతురు ఆసుపత్రి ఓపెనింగ్రోజు వేసుకున్న షర్టే గురువారం కూడా ఉంది. షర్టులు మార్చకుండానే రాజకీయాలు మార్చుతావు.. హరీష్‌రావు రాకపోతే ఆసుపత్రి తలుపులు తెరుచుకోకపోవునా..?' అంటూ ఎద్దేవా చేస్తున్నారు. గత ఎన్నికల్లో పరోక్షంగా మీ గెలుపునకు సహకరించారనే మంత్రులను పిలిచి ఆసుపత్రి ఓపెనింగ్చేయించావా..? రఘునందన్‌రావు అంటూ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఓ చోట మోకరిల్లడం, మరో చోట జనం చూస్తున్నారని ఆరోపణలతో పోరాటమా..? అని విమర్శలు చేశారు. సాధ్యం కానీ హామీలు ఇచ్చి గద్దనెక్కి ఇప్పుడు జనం తిరగబడితే ఆ నెపం టీఆర్ఎస్ పై నెట్టడానికి రఘునందన్‌రావు పడరాని పాట్లు పడుతున్నారంటూ టీఆర్ఎస్కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కూడా ఆసుపత్రి ఓపెనింగ్ కు ఆహ్వానించారని ఆయన ఢిల్లీలో ఉండడంతో రాలేకపోయారని బీజేపీ శ్రేణులు కౌంటర్లు ఇస్తున్నారు.