- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Samantha: బరువు తగ్గడంపై నెటిజన్ కామెంట్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన సమంత(పోస్ట్)
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ‘ఏమాయ చేసావే’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఈ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడింది. అలా కొన్నేళ్లు ప్రేమించుకున్న వీరు పెద్దల నొప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ, మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు. విడాకుల తర్వాత నాగచైతన్య రీసెంట్‌గా స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళతో ఎంగేజ్‌మెంట్ చేసుకొని రెండో పెళ్లికి రెడీ అయ్యాడు. సమంత మాత్రం విడాకుల తర్వాత మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. హెల్త్ పై ఫోకస్ పెట్టింది. కాగా ప్రస్తుతం ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్‌తో మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నది. యంగ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ఈ సిరీస్ నవంబర్ 7నుంచి అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఈ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాలతో సమంత బిజీగా ఉంది.
ఇదిలా ఉంటే.. తాజాగా సమంత తన సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ నిర్వహించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘క్యూ అండ్ ఎ’ సెషన్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. మళ్లీ బరువు పెరగొచ్చు కదా అని ఓ నెటిజన్ కామెంట్‌పై ఈ అమ్మడు ఫైర్ అయింది. ఆమె మాట్లాడుతూ.. ‘మళ్ళీ బరువు గురించే ప్రశ్న. నా బరువు గురించి నాకు తెలుసు. ప్రస్తుతం నేను చాలా స్ట్రిక్ట్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్‌లో ఉన్నాను. అందువల్లే నా బరువు ఇలా ఉంది. నా ఆరోగ్య పరిస్థితుల వల్ల నేను ఇలానే ఉండాలి. ఇతరులను జడ్డ్ చేయడం ఆపండి. వారిని కూడా బతకనివ్వండి. మనం 2024లో ఉన్నాము’ అంటూ కాస్త గట్టిగానే సమంత చెప్పింది. ప్రస్తుతం సామ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. దీన్ని బట్టి చూస్తుంటే ఆమె ఇంకా పూర్తిగా కోలుకోలేదని అర్థం అవుతోంది. దీంతో సామ్ పూర్తిగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.