Neha Dhupia: కలలు కనే ప్రతీ అమ్మాయికి అండగా నిలుస్తాను.. మాజీ మిస్ ఇండియా

by Nagaya |   ( Updated:2022-07-05 10:22:55.0  )
Neha Dhupia Completing 20 Years of  winning Miss India, Says Gratitude to Fans
X

దిశ, సినిమా: Neha Dhupia Completing 20 Years of winning Miss India, Says Gratitude to Fans| మాజీ మిస్ ఇండియా, బాలీవుడ్ నటి నేహా ధూపియా గతాన్ని తలుచుకుని ఎమోషనల్ అయింది. 2002లో మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్న ఆమె.. నేటితో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్పెషల్ నోట్ షేర్ చేసింది. ఈ క్రమంలోనే తనకు అండగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపిన నటి.. 'ఒక్కసారి కళ్లు మూసుకుని ఆలోచిస్తే.. 20 ఏళ్లు క్షణంలో గడిచిపోయినట్లుగా ఉంది.

అయితే అదే వేదికపై మళ్లీ కిరీటాన్ని ధరించడం సాధ్యమవుతుందని అనుకోలేదు. కానీ, కలలు కంటూ కష్టపడి పనిచేసే ప్రతీ అమ్మాయికి అండగా ఉంటాను. ఆడపిల్లలకు తల్లితండ్రులను గర్వపడేలా చేయడం కంటే మరో గొప్ప అనుభూతి లేదు. వైవాహిక సంబంధంలోనూ ప్రతి భాగస్వామిని ప్రేమ, సమానత్వంతో చూస్తూ కలలకు జీవం పోయాలని కోరుకుంటాను' అంటూ రాసుకొచ్చింది. అలాగే కొంతమంది జీవితాల్లో కిరీటం దక్కలేదని బాధనిపించినా.. అలాంటివాళ్లు అత్యంత విలువైన లక్షణాలున్న వ్యక్తులుగా సమాజంలో విలువ పొందుతారంటూ పాజిటీవ్‌గా మాట్లాడింది.

Advertisement

Next Story