రహస్యంగా పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్.. ? ఫోటో వైరల్

by samatah |   ( Updated:2022-03-14 07:30:39.0  )
రహస్యంగా పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్.. ? ఫోటో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్ : నయనతార, విఘ్నేష్ శివన్ లవ్ గురించి అందరికీ తెలిసిందే. ఇక వీరు పెల్లి చేసుకున్నారా..? అంటే అవునూ అంటున్నారు ఈ ఫొటోలు చూసిన వారు. అయితే తాజగా విఘ్నేష్ శివన్ నయనతార చెన్నైలోని కాలికాంబల్ ఆలయానికి వెళ్లారు. అక్కడ వారిద్దరు కలిసిదిగి ఫొటోలో నయన్ నుదుట సింధూరం పెట్టుకొని కనిపించింది. అయితే పెళ్లైన స్త్రీలు మాత్రమే నదుట సింధూరం పెట్టుకుంటారు. దీంతో వీరిద్దరు రహస్యంగా పెళ్లి చేసుకున్నారు అంటూ సోషల్ మీడియాలో గుస గుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా నయన్ శివన్‌లు ఇటీవలే ఎంగేజ్ మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో మీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ.. పలు వార్తలు సోషల్ మీడియాలో ఇప్పటికే హల్ చేశాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరు టెంపుల్‌‌లో దిగిన ఫొటోను చూసిన వారందరూ ..వీరికి పెళ్లి అయిపోయిందని, అయితే ఆ విషయాన్ని వీరు గోప్యంగా ఉంచుతున్నారని వారి అభిమానులు చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story