- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Nawazuddin Siddiqui: నాలో స్త్రీ లక్షణాలు ఉన్నాయంటున్నారు.. స్టార్ నటుడు
దిశ, సినిమా: ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించిన తాజా చిత్రం 'హీరోపంతి 2'. శుక్రవారం విడుదల కానున్న మూవీలో సరికొత్త అవతార్‌లో కనిపించనున్న ఆయన.. తన క్యారెక్టర్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తానని హామీ ఇచ్చాడు. తాను పోషించిన 'లైలా' పాత్రకు సంబంధించిన అనుభవాలను పంచుకున్న నవాజ్.. 'ఈ పాత్ర ఊహించలేనిది. చాలా చమత్కారమైనది. ఇందులో నా హావభావాలు, నడక, స్పర్శ మహిళలను పోలిఉంటుంది. ఈ క్యారెక్టర్ షూటింగ్ మొదలైనప్పటి నుంచి నేను కూడా లైలా పాత్రలో లీనమైపోయాను. నిజ జీవితంలోనూ అలాగే బిహేవ్ చేయడంతో నేను స్త్రీ లక్షణాలు ప్రదర్శిస్తున్నట్లుగా గుర్తించిన ససన్నిహితులు.. నా బాడీ లాంగ్వేజ్, నడకలో వచ్చిన మార్పు సాధారణ శైలికి భిన్నంగా ఉందంటున్నారు. కొంతమంది నిజంగానే నాకు ఏదో జరిగిందని, మహిళల లక్షణాలు పూనుకున్నాయని మాట్లాడుకుంటున్నారు' అని వివరించాడు. దీన్ని బట్టి తాను లైలా పాత్రలో ఎంతగా ఇమిడిపోయానో తెలుస్తుందన్న నటుడు.. షూటింగ్ అయిపోయాక క్యారెక్టర్ నుంచి బయటపడ్డానని తెలిపాడు.