Sai Pallavi: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి కీలక వ్యాఖ్యలు..!!

by Anjali |   ( Updated:2024-10-25 06:59:26.0  )
Sai Pallavi: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి కీలక వ్యాఖ్యలు..!!
X

దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. రీసెంట్ గా ఈమె ఓ ఇంటర్వ్యూకు హాజరై బాలీవుడ్ పీఆర్ ఏజెన్సీ(Bollywood PR Agency)ల గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. ఎప్పుడూ లైమ్‌లైట్(limelight) లో నిలవాలని బాలీవుడ్‌లో పీఆర్‌ ఏజెన్సీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటారని వెల్లడించింది. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాక.. ఓ పర్సన్ సాయిపల్లవికి కాల్ చేశాడని తెలిపింది. ‘నన్ను నేను ప్రమోట్ చేసుకోవడానికి, అలాగే సోషల్ మీడియాలో హైలెట్ కావడం కోసం పీఆర్ ను పెట్టుకుంటారా? అని అడిగారని’ చెప్పింది. వాళ్లు చెప్పినట్లు అలా చేస్తే తను లైమ్ లైట్ లో ఉండగలనని, అందరూ నా గురించి మాట్లాడుకోవడం వల్ల యూజ్ ఏం లేదని పేర్కొంది. తరచూ జనాలంతా తన గురించి మాట్లాడుకుంటే వారికి కూడా విసుగువస్తుందని వివరించింది. కాగా అలాంటి నాకు వద్దు అని డైరెక్ట్ చెప్పేశానని సాయి పల్లవి తెలిపింది. ప్రస్తుతం ఈ నేచురల్ బ్యూటీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సాయిపల్లవి రామాయణ (Ramayana)సినిమాలో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తోన్నవిషయం తెలిసిందే. ఈ మూవీలో రణ్ బీర్ కపూర్ (Ranbir Kapoor)రాముడిగా మెరవనున్నారు. రావణుడిగా యశ్(Yash) కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

Advertisement

Next Story

Most Viewed