- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Allu Arjun : అల్లు అర్జున్ కు హైకోర్టులో బిగ్ రిలీఫ్
దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) కు హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో ఏపీలోని నంద్యాల పోలీసులు టాలీవుడ్ ప్రముఖ నటుడు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల తనపై నమోదైన కేసును కొట్టివేయాలని అల్లు అర్జున్, మాజీ ఎమ్మెల్యే రవిచంద్ర కిశోర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై నేడు కోర్టులో విచారణ జరిగగా.. అల్లు అర్జున కు భారీ ఊరటనిచ్చింది ధర్మాసనం. ఈ కేసుపై నవంబర్ 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ కేసుపై నవంబర్ 6న తదుపరి ఉత్తర్వులు ఇస్తామని న్యాయస్థానం పేర్కొంది.
ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో నంద్యాలలోని వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి ఇంటికి భారీ వాహన శ్రేణితో అల్లు అర్జున్ వచ్చారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని అప్పట్లో అల్లు అర్జున్, శిల్పా రవి మీద నంద్యాల పోలీసులు కేసు నమోదు చేశారు.