- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Suresh Babu: ఓటీటీ యుగంలో ఎవరికి వారే కంటెంట్ క్రియేటర్లు: నిర్మాత సురేష్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా (Social Media), ఓటీటీ (OTT) యుగంలో ఎవరికి వారే కంటెంట్ క్రియేటర్లు అని ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు (Daggubati Suresh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన విశాఖ (Vishakha)లో సీఐఐ (CII) ఆధ్వర్యంలో నిర్వహించిన టూరిజం అండ్ ట్రావెల్స్ సమ్మిట్ (Tourism and Travels Summit)లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్ (Ministr Kandula Durgesh) అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి మాట్లాడుతూ.. విశాఖలో షూటింగ్(Shooting) కోసం సింగిల్ విండో సిస్టమ్‌ను (Single window system) తీసుకొస్తామని అన్నారు.
షూటింగ్ కోసం ఏ ప్రాంతానికైనా వేళితే.. అక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 2025-30 ఐదు ఏళ్లకు టూరిజం పాలసీ తయారు చేస్తామని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలోనే మూవీ షూటింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయని గుర్తు చేశారు. అనంతరం నిర్మాత సురేష్ బాబు (Suresh Babu) మాట్లాడుతూ.. చాలా కష్టం మీద తెలుగు సినిమా ఇండస్ట్రీ చెన్నై (Chennai) నుంచి హైదాబాద్ (Hyderabad)కు వచ్చిందని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తమకు మంచి మార్కెటే ఉందని తెలిపారు. ఇప్పటికిప్పుడు ఇండస్ట్రీ ఏపీకి రావాలనుకోవడం కాదని.. లోకల్‌గా ఉన్న కంటెంట్‌ను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. సోషల్ మీడియా (Social Media), ఓటీటీ (OTT) యుగంలో ఎవరికి వారే కంటెంట్ క్రియేటర్లు (Content Creaters)గా తయారు అయ్యారని సురేష్ బాబు అన్నారు.