UPSC: సివిల్స్ తుది ఫలితాలు విడుదల.. టాప్ 5 ర్యాంకర్లు వీరే?

by vinod kumar |
UPSC: సివిల్స్ తుది ఫలితాలు విడుదల.. టాప్ 5 ర్యాంకర్లు వీరే?
X

దిశ, నేషనల్ బ్యూరో: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష 2024 తుది ఫలితాలు విడుదలయ్యాయి. యూపీఎస్సీ మంగళవారం ఫలితాలను రిలీజ్ చేసింది. మొత్తం1009 మంది అభ్యర్థులను ఐఏఎస్ (IAS), ఐపీఎస్ (IPS), ఐఎఫ్ఎస్ (IFS) సర్వీసులకు ఎంపిక చేసింది. అందులో 725 మంది పురుషులు ఉండగా 284 మంది మహిళలు ఉన్నారు. అలాగే 335 మంది జనరల్ కేటగిరీకి చెందినవారు ఉండగా, 109 మంది ఈడబ్లూఎస్, ఎస్సీలు 160, ఎస్టీలు 87, ఓబీసీలు 318 మంది ఉన్నారు. మొత్తంగా 284 మంది మహిళలు ఎంపికైన అభ్యర్థుల జాబితాను మాత్రమే యూపీఎస్సీ వెల్లడించింది. 15 రోజుల తర్వాత అభ్యర్థుల మార్కులు విడుదల చేయనుంది.

టాపర్‌గా శక్తి దూబే

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన శక్తి దూబే (Shakti dube) టాపర్‌గా నిలిచారు. అలహాబాద్ విశ్వవిద్యాలయం నుంచి బయోకెమిస్ట్రీ (బ్యాచిలర్ ఆఫ్ సైన్స్) లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన దూబే.. పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ సబ్జెక్టులను ఆప్షనల్ గా ఎంచుకున్నట్టు యూపీఎస్సీ తెలిపింది. అలాగే హర్యానాకు చెందిన హర్షిత గోయల్ రెండో ర్యాంక్ సాధించగా.. డోంగ్రే అర్చిత్ పరాగ్ మూడో ర్యాంక్, షా మార్గి చిరాగ్‌ నాలుగో ర్యాంక్, ఆకాశ్ గార్గ్ ఐదో ర్యాంకు సాధించారు.

కాగా, 2024 సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష గతేడాది జూన్ 16న జరిగింది. ఈ పరీక్షకు మొత్తం 9,92,599 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 5,83,213 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వారిలో 14,627 మంది అభ్యర్థులు మెయిన్స్ కు అర్హత సాధించగా వారికి సెప్టెంబర్ లో మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించి 2,845 మందిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేశారు. తాజాగా తుది ఫలితాలు వెల్లడించారు.



Next Story

Most Viewed