ప్రపంచస్థాయి అవార్డ్‌కు ఎంపికైన మహేష్ బాబు హీరోయిన్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు!

by Hamsa |
ప్రపంచస్థాయి అవార్డ్‌కు ఎంపికైన మహేష్ బాబు హీరోయిన్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు!
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) అరుదైన ఘనతను దక్కించుకుంది. ప్రముఖ గోల్డ్ హౌస్ గాలా సంస్థ అందించే గ్లోబల్ వాన్‌గార్డ్ హానర్ అవార్డుకు ఎంపికైంది. అయితే ఈ అవార్డును ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన సెలబ్రిటీలు, లీడర్లకు అందిస్తారు. ఇక ఇండియా నుంచి ప్రియాంక ఎంపికవడం విశేషం. అయితే ఈ అవార్డును మే 10న లాస్ ఏంజిల్స్‌లోని మ్యూజిక్ సెంటర్‌లో జరిగే గోల్డ్ హౌస్ గాలా నాల్గవ వార్షిక సమావేశంలో ప్రియాంకను సత్కరించనున్నారు. ఈ వేడుకకు సినిమా, సాంకేతికత, మీడియాతో పాటు వివిధ పరిశ్రమలకు చెందిన 600 మందికి పైగా గెస్టులు హాజరుకాబోతున్నట్లు సమాచారం. ప్రియాంకకు అవార్డు వచ్చిందని తెలుసుకున్న అభిమానులు ఫుల్ ఖుషీ అవుతూ కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా, ప్రియాంక చోప్రా సినిమాల విషయానికొస్తే..ఈ అమ్మడు సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ‘SSMB-29’ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ పాన్ ఇండియా చిత్రంతోనే ఆమె తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తోంది. రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.



Next Story

Most Viewed