- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ నాయకుల జాతీయ రహదారి దిగ్బంధం
దిశ, రామడుగు: ఎండిపోతున్న పంటపొలాలను ఎల్లం పల్లి నీటితో నారాయణపూర్ రిజర్వాయర్ నింపి రైతులను కాపాడాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గంగాధర చౌరస్తాలో కరీంనగర్, జగిత్యాల జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పదండి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. చొప్పదండి కేంద్రంగా నీటిని ఇతర ప్రాంతాలకు తరలిస్తూ.. ఇక్కడి రైతుల నోట్లో మట్టి కొట్టారన్నారు. చొప్పదండి నియోజకవర్గాన్ని కోనసీమ గా మార్చామని ప్రగల్భాలు పలుకుతున్న ఎమ్మెల్యే కి ఎండిపోతున్న పంట పొలాలు కానరావడం లేదా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున రోడ్డు పై బైటాయించడంతో పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఈ కార్యక్రమంలో ఐదు మండలాల కాంగ్రెస్ అధ్యక్షుడు మనోహర్, శ్రీనివాస్, తిరుపతి, శ్రీనివాస్, ఎస్.రమణ రెడ్డి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.